Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ఎవరూ రారనీ.. ఏదీ చేయరనీ..!

No one can do anything .. nothing to do ..

ఓ పాతికేళ్ల యువకుడు బోలెడంత జీతం వచ్చే ఐటీ కొలువును వదిలేసి, కోళ్ల పెంపకం మొదలు పెట్టాడు. కోళ్ల ఫారమ్‌ పక్క నుండి బస్సు వెళుతుంటే వచ్చే ఆ దుర్వాసనను భరించలేం. మరి లక్షల వేతనాన్ని ఆ యువకుడు ఎందుకు వదిలేసుకున్నట్లు.? 
ఓ పాతికేళ్ల అమ్మాయి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం బాట పట్టింది. పూల పెంపకం చేస్తూ ఉపాధిని వెతుక్కుంది. వ్యవసాయం చేయలేకపోతున్నాం మొర్రో అంటూ రైతులు ప్రాణం తీసుకుంటుంటే, ఇక్కడ ఈ యువతికి వ్యవసాయం లాభసాటి ఎలా అవుతుంది.?

ఆలోచన మంచిదైతే గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం దొరుకుతుంది. పై రెండు సందర్భాల్లోనూ జరిగిందదే. కోట్లు సంపాదించేద్దామనే ఆలోచనతో పైన పేర్కొన్న ఇద్దరూ కొత్త మార్గాల్ని ఎంచుకోలేదు. సాఫీగా సాగిపోతున్న జీవితం కంటే ఆత్మ సంతృప్తి కోసం కొత్తదనాన్ని ఆశ్రయించడం, సవాళ్లను స్వీకరించడం మంచిదనే ఆలోచనతో అడుగు ముందుకు వేశారు. అనుకున్నది సాధించారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించిందొకరైతే, అసలు సాంకేతికతతో పని లేకుండా సంప్రదాయ మార్గంలో ఆలోచించారు మరొకరు. ఇద్దరూ తమ తమ దారుల్లో అద్భుతమైన విజయాల్ని చవి చూస్తున్నారు.

తమను తామే వ్యాపార వేత్తలుగా మలచుకున్నారు. పని చేసేదీ, సొమ్ము చేసుకునేదీ తామే. నేనే బాస్‌, నేనే కూలీ.. అన్నది వీరి విధానం. తను పని చేస్తూ, పది మందికి పని కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. విదేశాలకే పరిమితమైన కొన్ని రకాల పండ్లనూ, పూలనూ, కూరగాయలనూ ఉత్పత్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. విదేశాల్లో తాము చూసిన విశేషాల నుండి తమను తాము ఎలా సరికొత్తగా తీర్చి దిద్దుకోగలమో ప్రణాళిక రచించుకుని రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి వారికి ఆలోచనే పెట్టుబడి. నిజమే ఆలోచనను మించిన పెట్టుబడి ఏముంటుంది.? సున్నా పెట్టుబడితో ప్రయాణం మొదలుపెట్టిన వారూ ఉన్నారు. ఎంతో కొంత పెట్టుబడితో మొదలుపెట్టినవారూ ఉన్నారు. కావల్సిందల్లా మెరుగైన ఆలోచనే. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించడం నేటి యువత గొప్పతనం. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ పరిజ్ఞానం నేటి యువతకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రపంచం చిన్నదైపోయింది కదా. ఎక్కడి నుండైనా సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు.

మరిన్ని యువతరం
This is a political tactic.