Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
alaa ee cinemalu teesaru

ఈ సంచికలో >> సినిమా >>

మురిసిపోయిన సీతారామశాస్త్రి

murisipoyina seetarama sastry

పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిది విశాల దృక్పథం. ఆయన పాటలెంత అందంగా వుంటాయో, ఆయన మనసూ అంతే అందంగా వుంటుంది. తానెంత గొప్ప పాటలు రాసినా, ఇతరులు రాసిన మంచి పాటలను అభినందించే గుణం వున్నప్పుడే వ్యక్తిగా ఉన్నత స్థానంలో నిలబడ్తారు. ఆ గొప్పతనం సిరివెన్నెలకు సొంతం.

సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ మధ్య పాటల రచయితగా మారి, అడపా దడపా పాటలు రాస్తూ వస్తున్నాడు. అలా ఆయన రాసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం..’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలోనిది ఈ పాట. ఈ పాట వచ్చినప్పుడల్లా దాన్ని ఆస్వాదిస్తారట సిరివెన్నెల సీతారామశాస్త్రి.

దేవిశ్రీప్రసాద్ రాత చాలా బాగుందనీ, భావాలు చక్కగా పాటలో పండించాడని దేవిశ్రీప్రసాద్ ని సీతారామశాస్త్రి అభినందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. సీతారామశాస్త్రి అభినందనలు పక్కన పెడితే, ‘పిల్లా నువ్వు లేని జీవితం..’ పాటలో దేవిశ్రీప్రసాద్ రెచ్చిపోయాడనే చెప్పాలి.

మరిన్ని సినిమా కబుర్లు
youth shocking by singeetham