సినిమా అంటే తెరపై చూసినంత ఈజీ కాదని చాలామందికి తెలుసు. కొన్ని సినిమాల షూటింగ్ సరదాగా గడిచిపోతే, కొన్ని సినిమాల షూటింగ్ చాలా కష్టంగా వుంటుంది. చాలా కష్టాలకోర్చి సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వస్తుంది తారలకి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘మంగళ’ అంటోంది ఛార్మి.
‘మంగళ’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టాలు పడాల్సివచ్చిందనీ, అడవిలోనే చాలా రోజులు వుండిపోవాల్సి వచ్చిందని ఛార్మి చెప్పింది. ఎంత కష్టపడ్డా సినిమాని తెరపై చూసుకున్నాక ఆ కష్టమంతా మర్చిపోయాననీ, ఎప్పుడు ‘మంగళ’ సినిమాని చూసినా, సినిమా కష్టాలు గుర్తుకొస్తాయనీ, ఆ వెంటనే సంతోషంగా వుంటుందనీ ఛార్మి వెల్లడించింది.
ఇటీవలే ఛార్మి ‘మంగళ’ సినిమాని హిందీలో చూసిందట. ఆ సినిమా చూశాక, షూటింగ్ అనుభవాలు గుర్తుకు తెచ్చుకుని సన్నిహితులతో వాటిని పంచుకుంది ఛార్మి.
|