Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
who is the first crorepathi

ఈ సంచికలో >> సినిమా >>

జేడీ సినిమాలో మార్పులు

changes in JD movie

నటుడు జేడీ చక్రవర్తి దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. వీటిల్లో కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలూ సాధించినా, నటుడిగా, దర్శకుడిగా జేడీ చక్రవర్తి ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడన్నది వాస్తవం. వరుసగా మళ్ళీ సినిమాల్లో నటిస్తానని చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రకటించి, వరుసగా రెండు మూడు సినిమాలు చేసి మళ్ళీ సైలెంటయ్యాడు జేడీ చక్రవర్తి.

కొన్ని రోజుల క్రితం ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించిన జేడీ, నటీనటుల ఎంపిక చేసే ప్రయత్నంలో బిజీ అయ్యాడు. ఫలానా ఫలానా నటీనటులైతే బావుంటుందనే ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడట జేడీ. కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని భావించడం వల్లే ఆ ప్రాజెక్ట్ పక్కన పడిందని తెలుస్తోంది.

ఏదో ఒక సినిమా చేసేయడం కన్నా, మంచి సినిమా చేయాలన్న ఆలోచనతోనే జేడీ, తాను చేయబోయే కొత్త సినిమా విషయంలో టైమ్ తీసుకుంటున్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందని జేడీ ఆశాభావంతో వున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam