Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
flop oka peedakala - venkatesh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష: సత్య - 2

satya - 2: movie review
చిత్రం: సత్య'2'
తారాగణం: శర్వానంద్, అనైకా సోటి, ఆరాధనా గుప్తా, మహేష్ ఠాకూర్, రాజ్ ప్రేమ్ జీ, కుషాల్ కపూర్, అమిత్రియాన్ తదితరులు
ఛాయాగ్రహణం: వికాష్ ష్రాఫ్
సంగీతం: సంజీవ్ 'దర్శన్' నితిన్' శ్రీ
లిరిక్స్ : సిరాశ్రీ, శివపుత్ర
మాటలు: మీరాఖ్ 
నిర్మాణం: మమ్మూత్ మీడియా, ఎల్.ఆర్. మీడియా
నిర్మాత: సుమంత్ రెడ్డి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేదీ: 8 నవంబర్ 2013
 
క్లుప్తంగా చెప్పాలంటే:
ఓ చిన్న టౌన్ నుంచి హైదరాబాద్ కి వెళ్తాడు సత్య (శర్వానంద్ ) అనే కుర్రాడు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళిన సత్యకి, హైదరాబాద్ లో పేరుమోసిన బిల్డర్ ఈశ్వర్ రావు (మహేష్ ఠాకూర్ ) దగ్గర పని దొరుకుతుంది. తన తెలివితేటలతో తక్కువ కాలంలోనే ఈశ్వర్ రావు కి కుడి భుజంగా మారతాడు సత్య. హైదరాబాద్ ని భయపెట్టే కంపెనీకి మాస్టర్ బ్రెయిన్ గా సత్య రూపాంతరం చెందుతాడు. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా హైదరాబాద్ ని భయపెట్టే ఆ గ్యాంగ్ ని అంతమొందిచే దిశగా పోలీసుల వైపు నుంచి జరిగే ప్రయత్నాలు.. వాటి కారణంగా సత్య జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఇవన్నీ తెరపై చూడాల్సిన అంశాలు.
 
మొత్తంగా చెప్పాలంటే:
శర్వానంద్ మంచి నటుడని ఎవరైనా ఒప్పుకుంటారు. మంచి పాత్రలు దొరికితే శర్వానంద్ నటనా ప్రతిభ వెలికి వస్తుంది. సత్య`2 కూడా అలాంటిదే. పాత్రకు ఎంత అవసరమో అంతమేర తన నటనా ప్రతిభను ప్రదర్శించాడు. సందర్భానుసారం అతను సన్నివేశాల్లో జీవించాడనే చెప్పవచ్చు. అనైక క్యూట్ గా కన్పించింది. నటన పరంగానూ మంచి మార్కులేయించుకుంటుంది. మంచి ప్రాజెక్టుల్ని ఎంచుకుంటే హీరోయిన్ గా రాణించేందుకు అన్ని అర్హతలూ ఆమెకు వున్నాయి. ఆరాధన గ్లామరస్ గా కన్పించింది, కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా నటించింది. మహేష్ ఠాకూర్ నటనతో ఆకట్టుకుంటాడు. కుషాల్ కపూర్, అమిత్రియాన్ ఓకే. రాజ్ ప్రేమ్ జీ ఫర్వాలేదు. టెక్నికల్ డిపార్ట్ మెంట్స్  విషయానికొస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం బాగా కుదిరాయి. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుంటే బావుండేదన్పిస్తుంది. ఆడియోలో 8 పాటలు ఉన్నా తెర మీద 4 పాటలే కనిపించాయి. వాటిల్లో రెండు పాటలు (నువ్వు లేక నేను లేను, ఏవేవో పిచ్చి ఊహలే) బావున్నాయి.  కాస్ట్యూమ్స్ , ఆర్ట్ డిపార్ట్ మెంట్ సినిమాకి బలాన్నిచ్చాయి.

రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి సినిమాలు కొట్టిన పిండి. ఒక హీరో ముప్ఫయ్ మంది దుష్టుల్ని శిక్షించడమనే ఓల్డ్ ట్రెండ్ కి కొంచెం దూరం జరిగి, మాఫియా అంశాన్ని పక్కాగా డీల్ చేసి, ఇదివరకు చాలా విజయాలు సాధించారు వర్మ. మధ్యలో ఒకటీ అరా సినిమాలు నిరాశపర్చినా, మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలంటే అవి వర్మ తెరకెక్కిస్తేనే అందంగా వుంటాయనేంత రీతిలో ఆ తరహా సినిమాలకు పేటెంట్ హక్కు పొందారాయన. సత్య`2 లోనే ఆ స్పెషాలిటీని చూపించగలిగారు. స్క్రిప్ట్ , స్క్రీన్ ప్లే విభాగాలతో వర్మ తన మార్క్ ని
చాటుకున్నారు.

ఫస్టాఫ్ అంతా సజావుగా సాగిపోతుంది, ఇంటర్వెల్ ప్రామిసింగ్ గా వుంటుంది. సెకెండాఫ్ లో కొన్ని లూప్ హోల్స్ కారణంగా, కాస్తంత పేస్ తగ్గినా, ఓవరాల్ గా సినిమా ప్రేక్షకుల్ని నిరాశపర్చదు.

ఒక్క మాటలో చెప్పాలంటే: బాగుంది

అంకెల్లో చెప్పాలంటే: 3/5
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka