Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ముందే గెలిచేసిన రామ్‌గోపాల్‌ వర్మ.!

ramgopal varma sensation

సంచలనాలకు మారు పేరు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన పెదవి విప్పితే చాలు అదొక సంచలనం. ఇప్పుడు తాజా చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో పెను సంచలనాలకు తెర లేపాడీ దర్శకుడు. వర్మ సినిమాలకి ప్రత్యేకించి ప్రచారంతో పని లేదు. సోషల్‌ మీడియాలో వర్మ పెట్టే కామెంట్స్‌ చాలు. ఓ మోస్తరు సబ్జెక్ట్‌తో పెద్దగా పేరు లేని నటీనటులతో వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని రూపొందించారు. అత్యంత భారీ ఖర్చుతో రూపొందిన బాలయ్య 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ చతికిలపడింది.

ఈ నేపథ్యంలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'పై కొన్ని అనుమానాలు కలగడం సహజమే. కానీ వర్మ ఈ సినిమా కోసం చేయించిన ఖర్చు ఈ సినిమాకి లభిస్తున్న పబ్లిసిటీ చూస్తే ఎవరైనా సరే వర్మ ఈజ్‌ గ్రేట్‌ అని ఒప్పుకోవాల్సిందే. సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్న ఒక్కో ప్రోమో ఒక్కో తరహా సంచలనానికి వేదికవుతోంది. అంటే వర్మ ముందే గెలిచేసినట్లే. అనూహ్యమైన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ఇప్పుడంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. 22న సినిమా విడుదల కావల్సి ఉండగా, విడుదలను ఆపాలంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమీషన్‌ని ఆశ్రయించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా విడుదలైతే, ఎన్నికల సమయంలో ఇదొక సంచలనంగా కాబోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ సంచనలం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
churaka