Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

రేణూదేశాయ్‌కి ఆ స్వేచ్ఛ లేదా.

Is that freedom or not

సినీనటి రేణూదేశాయ్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. సోషల్‌ మీడియా వేదికగా కొందరు దురభిమానుల వేధింపులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. రేణూదేశాయ్‌ ఒకప్పుడు పవన్‌ కళ్యాణ్‌ భార్య. కానీ ఇప్పుడు కాదు. పవన్‌ నుండి విడిపోయాక, ఆమె ఒంటరిగా జీవితం గడుపుతోంది. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. కానీ పెళ్లికి సంబంధించి ఇటీవల కాలంలో ఎలాంటి ప్రకటనా లేదు. అది ఆమె వ్యక్తిగతం. ఇక సినీ నటిగా దర్శకురాలిగా, రచయిత్రిగా ఆమె సొంతంగా తన ప్రయాణం తాను చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు కూడా. 'వదినమ్మా' అంటూ ఇప్పటికీ ఆమెను కొందరు పవన్‌ అభిమానులు ఆప్యాయంగా పిలుచుకుంటారు. అదే సమయంలో కొందరు మాత్రం రేణూదేశాయ్‌ చేసే ప్రతీ పనిని తప్పుపడుతుంటారు.

ఇటీవలే రైతు సమస్యలు తెలుసుకునేందుకు ఓ ఛానెల్‌తో కలిసి రైతుల వద్దకు వెళ్లారు రేణూదేశాయ్‌. దాంతో కొందరు దురభిమానులు రేణూదేశాయ్‌పై బూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఈ పరిణామం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారామె. సెలబ్రిటీల్ని సామాన్యులు బూతులు తిట్టడం ఫ్యాషన్‌ అయిపోయింది. సెలబ్రిటీలు పొరపాటున కూడా నోరు జారకూడదు. ఒక్కసారి మనుషుల్లా ఆలోచిస్తే, ఎవ్వరూ ఎవ్వర్నీ తిట్టాల్సిన పని లేదంటూ రేణూదేశాయ్‌ అభిప్రాయపడింది. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకోసం రేణూదేశాయ్‌ సమాయత్తమవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకురాలిగా రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా రూపొందించనున్నారామె. 

మరిన్ని సినిమా కబుర్లు
cine hungama