Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine hungama

ఈ సంచికలో >> సినిమా >>

'అఖిల్‌' భామని పెళ్లాడిన 'వరుడు' విలన్‌.!

arya married sayesha

వాళ్లిద్దరూ ఒకరి మీద ఒకరు మనసు పడ్డారు. సినీ పరిశ్రమలో అన్ని ప్రేమలూ పెళ్లి పీటలెక్కవ్‌. అఫ్‌కోర్స్‌ బయట కూడా అంతే. అయితే సాయేషా, ఆర్య తమ ప్రేమను గెలిపించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా సాయేషా, ఆర్యల ప్రేమ గురించి చాలా గాసిప్స్‌ వచ్చాయి కానీ, ఇద్దరూ తమ ప్రేమని ప్రకటించడానికి చాలా టైం తీసుకున్నారు. అఫీషియల్‌గా ప్రేమ ప్రకటన చేశాక, పెళ్లికి ఎక్కువ టైం తీసుకోలేదు. చకచకా పెళ్లి పనులు జరిగిపోయాయ్‌.

పెళ్లి తంతూ పూర్తయిపోయింది. ఎక్కడా ఎలాంటి వివాదాలకూ, ఎలాంటి విమర్శలకూ ఈ ఇద్దరూ తావివ్వలేదు. చిత్రమేంటంటే, ఇటు ఆర్య, అటు సాయేషా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక పక్క సినిమాల ప్రమోషన్స్‌, ఇంకో పక్క పెళ్లి పనులు ఇలా అందరికీ స్వీట్‌ షాక్‌ ఇచ్చారు ఆర్య - సాయేషా. తెలుగులో 'వరుడు' సినిమా చేశాడు ఆర్య. అందులో విలన్‌గా నటించాడు. మరో తెలుగు సినిమా 'సైజ్‌జీరో'లోనూ కనిపించాడు. సాయేషా విషయానికి వస్తే తెలుగులో ఆమె ఒకే ఒక సినిమాలో నటించింది. అదే 'అఖిల్‌'. హైద్రాబాద్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. 

మరిన్ని సినిమా కబుర్లు
On the way to the uncle- saidharamtej