Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Love is not so easy

ఈ సంచికలో >> సినిమా >>

అతివలపై ఎందుకీ అత్యుత్సాహం.!

Half of the sky

సీనియర్లు తమ స్థాయిని తగ్గించేసుకుంటున్నారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగించిన కెరీర్‌ని కేవలం ఒక్క మాటతో పోగొట్టేసుకుంటున్నారు. ఇదివరకటి పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉంటోందిప్పుడు. టంగ్‌ స్లిప్‌ అయినా అంతే సంగతి. తూచ్‌ అనుకోవడానికి లేదు. ఇక ఉద్దేశ్యపూర్వకంగా ఏదైనా కామెంట్స్‌ చేసినా సోషల్‌ మీడియాలో కనీస విజ్ఞత కూడా లేకుండా ఆడి పోసేసుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్‌ కాస్ట్యూమ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు చేదు అనుభవం చవి చూసిన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఆయన కామెంట్స్‌ని ఖండించారు. అనసూయ, రష్మీ తదితర భామలు నాగబాబుని సపోర్ట్‌ చేశారు. తాజాగా హీరోయిన్‌ నయనతారపై సీనియర్‌ నటుడు రాధా రవి చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో పెను దుమారాన్ని లేపాయి. సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుంది కానీ, ఆ సినిమా విజయానికి తోడ్పడే ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదు...

దెయ్యాల సినిమాల్లో నటించే నయనతార బయట కూడా దెయ్యంలాగే బిహేవ్‌ చేస్తుంటుంది అనే అర్ధం వచ్చేలా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అందరూ ఖండించారు. నయనతారకే అందరి నుండీ సపోర్ట్‌ లభించింది. ఈ తరహా వ్యాఖ్యలు చేసినందుకు రాధారవిపై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయనను తమ సినిమాల్లో నటింపచేయనియ్యమని పలువురు నిర్మాతలు ప్రకటించారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam