Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు నేర్చుకుంటోన్న అలియాభట్‌.!

aliyabhat learn telugu

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ తెలుగు నేర్చుకుంటోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ఇది. ఈ ప్రాజెక్ట్‌లో తనకి ఛాన్స్‌ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానంటోంది అలియాభట్‌. బాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న అలియభట్‌ అలా భావించడం విశేషం. అంతేకాదు, సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే భాషపై పట్టు ఉండాలంటోంది. భాషపై పట్టు సాధించేందుకే అలియాభట్‌ తెలుగు భాష నేర్చుకునేందుకు కసరత్తులు చేస్తోందట.

ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటోందట. కొన్ని కొన్ని పదాలకు అర్ధాలు తెలుసుకుంటోందట. అన్ని పదాలకూ అర్ధం తెలిసినప్పుడే పాత్ర తాలూకు లోతులు తెలుస్తాయంటోంది అలియాభట్‌. అప్పుడే తన పాత్రకు పూర్తి న్యాయం చేయగలనంటోంది. అంతేకాదు, అర్ధం తెలిసినప్పుడే, ఎక్స్‌ప్రెషన్‌ కరెక్ట్‌గా పలుకుతుంది.. అని అలియా చెబుతోంది. అలాగే రాజమౌళితో సినిమా చేయాలన్నది ఎప్పటి నుండో తన డ్రీమ్‌ అట. ఆ డ్రీమ్‌ ఇప్పుడు ఇలా ఫుల్‌ ఫిల్‌ అవుతుందని మురిసిపోతోంది అలియాభట్‌. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అలియాభట్‌, చరణ్‌కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
New boy. Adaragottestadu.!