Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
aliyabhat learn telugu

ఈ సంచికలో >> సినిమా >>

కొత్త కుర్రాడొస్తున్నాడు. అదరగొట్టేస్తాడు.!

New boy. Adaragottestadu.!

'విక్రమ్‌ సహిదేవ్‌' ఇప్పుడీ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ముద్దుల తనయుడే ఈ విక్రమ్‌ సహిదేవ్‌. ఏంటీ.. కొత్త కుర్రాడీ కథా, కమామిషు అంటే, 'ఎవడు తక్కువ కాదు' అనే సినిమాలో హీరోగా నటించాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తమిళంలో ఘన విజయం సాధించిన 'గోలీసోడా' సినిమాకి కన్నడ రీమేక్‌గా తెరకెక్కింది ఈ సినిమా. ఈ కన్నడ మూవీని టైటిల్‌ మార్చి తెలుగులో డబ్‌ చేస్తున్నారిప్పుడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్‌ సహిదేవ్‌ ఆల్రెడీ తెలుగులో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో సుపరిచితుడే. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ', 'రుద్రమదేవి', 'రేసుగుర్రం' సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రల్లో నటించి మెప్పించాడు. లేటెస్ట్‌గా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అన్వర్‌ పాత్రలో మైండ్‌ బ్లోయింగ్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి ప్రత్యేకంగా ఆకర్షించాడు.

ఇప్పుడు 'ఎవడు తక్కువ కాదు' సినిమాతో నూనూగు మీసాలతో హీరోగా సోలో పర్‌ఫామెన్స్‌ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు సహిదేవ్‌ నటనకు ఫిదా అయిపోతున్నారు. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విక్రమ్‌ సహిదేవ్‌కి బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా పరిచయమై హీరోలుగా స్టార్‌డమ్‌ దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. వారందరిలా విక్రమ్‌ సహిదేవ్‌లోనూ విషయముంది. సత్తా ఉన్న కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో హీరోగా స్టార్‌డమ్‌ దక్కించుకుంటాడనే నమ్మకాలు కలిగిస్తున్నాడు. చూడాలి మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
Mind Blowing Business!