Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Aliya for Akhil

ఈ సంచికలో >> సినిమా >>

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న 'హిప్పీ'.!

'Hippie'  release date fix

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్‌ మీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం 'హిప్పీ'. ఈ సినిమాతో మరోసారి ఆర్‌ఎక్స్‌ 100 మ్యాజిక్‌ని రిపీట్‌ చేస్తానంటున్నాడు కార్తికేయ. అందుకే ఈ సినిమా రిలీజ్‌ కోసం కూడా 'ఆర్‌ఎక్స్‌ 100' రిలీజ్‌ డేట్‌నే ఫిక్స్‌ చేసుకున్నాడు. జూన్‌ 7న 'హిప్పీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది ఇదే రోజున విడుదలైన 'ఆర్‌ఎక్స్‌ 100' అనూహ్యంగా సెన్సేషనల్‌ విజయం అందుకుంది. లక్కీగా అదే డేట్‌ ఈ సినిమాకి కూడా సెట్టయ్యింది. టి.ఎన్‌. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ అచ్చం 'ఆర్‌ఎక్స్‌ 100' ఫ్లేవర్‌తోనే కట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతకు మించే కానీ, అంతకు ఏమాత్రం తక్కువ కాదు. మళ్లీ అదే కంటెన్ట్‌తో, అదే రోజున వస్తున్న మనోడు అదే సెంటిమెంట్‌ రిపీట్‌ చేస్తాడో లేదో చూడాలి మరి. ఈ సినిమాలో దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమాలో ఎన్ని సెగలు పుట్టించనుందో తెలీదు కానీ, టీజర్‌ కోసమే ఈ హాట్‌ బ్యూటీ వేడి వేడిగా ఓ లిప్‌లాక్‌ లాగించేసింది. సీనియర్‌ నటుడు జె.డి.చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీజర్‌ అడల్ట్‌ కంటెన్ట్‌లా కనిపిస్తున్నా, కథలో ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయట. కథ నచ్చి జె.డి.చక్రవర్తి ఈ సినిమాలో ఆ ఇంపార్టెంట్‌ రోల్‌కి ఓకే చేశారట. చూడాలి మరి కార్తికేయ 'హిప్పీ'తో ఏం చేస్తాడో. మరోవైపు ఈ యంగ్‌ హీరో నాని సినిమా కోసం విలన్‌ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. 

మరిన్ని సినిమా కబుర్లు
double dhamakha