Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Alluvaarbayi

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్‌ కోసం అలియా వస్తుందా.?

Aliya for Akhil

ముచ్చటగా మూడు సినిమాలతోనూ బాక్సాఫీస్‌ని ఆకట్టుకోలేకపోయి అక్కినేని రాకుమారుడు అఖిల్‌ నాలుగో ప్రయత్నంగా సరికొత్త కథతో వస్తున్నాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్‌తో అఖిల్‌ తాజా మూవీ ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటనయితే రాలేదు కానీ, దాదాపు ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయినట్లే అని తెలుస్తోంది. ఈ సినిమాకి అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. డైరెక్టర్‌ రెడీ, ప్రొడ్యూసర్‌ రెడీ. మరి సినిమా ఇంకా ఎందుకు పట్టాలెక్కలేదు అంటే, అఖిల్‌ సరసన నటించబోయే ముద్దుగుమ్మ కోసం వేట కొనసాగుతోందట. అయితే ఈ సారి అఖిల్‌ సరసన బాలీవుడ్‌ ప్రముఖ నటి అలియాభట్‌ని తీసుకోవాలని చిత్ర యూనిట్‌ యోచిస్తోందట. నిజానికి అలియాభట్‌ని అఖిల్‌ తొలి సినిమాకే తీసుకురావాలనుకున్నారట. కానీ కుదరలేదు. ఆల్రెడీ అలియాభట్‌ తెలుగులో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తోంది.

సో నాగార్జున అడిగితే, అఖిల్‌ సరసన నటించేందుకు కూడా ఒప్పుకునే అవకాశాలు లేకపోలేవు. అయితే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సంగతి వేరు. అఖిల్‌ సినిమా సంగతి వేరు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. అక్కడున్నది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, యూనివర్సల్‌ డైరెక్టర్‌ రాజమౌళి. అన్నింటికీ మించి భారీ బడ్జెట్‌ చిత్రం. సో ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న మీదట అలియాభట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి ముందూ వెనకా ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. కానీ అఖిల్‌తో సినిమా అంటే కాస్త ఆలోచిస్తోందట. అయితే భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చి అయినా సరే అలియానే తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట అఖిల్‌. ఇదిలా ఉంటే, మరోవైపు 'భరత్‌' బ్యూటీ కియరా అద్వానీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అయితే కియారా,. లేకుంటే అలియా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అఖిల్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమనీ అతకచంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
'Hippie'  release date fix