Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

10-05-2019 నుండి 16-05-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, పెట్టుబడుల విషయాల్లో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉన్న అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం ద్వారా లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అవసరం. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన.

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది, పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండినిర్ణయాలు మిమ్మల్ని నిలబెట్టుతాయి. సామాజికకార్యక్రమాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. స్త్రీపరమైన విషయాల వలన లబ్దిని పొందుతారు. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలను సైతం శ్రద్దగా పట్టించుకోవడం సూచన. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం కలదు, ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారం మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తయి. సంతాన పరమైన విషయాల్లో గతంలో మీలో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఆరోగ్యం విషయంలో ఒకింత ఇబ్బందులు తప్పకపోవచ్చును. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఆదాయానికి తగినవిధంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంది.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం బంధువులను కలుస్తారు, బంధువులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో చేపట్టిన చర్చలు పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చర్చల్లో సమయం అధికంగా గడుపుతారు.
 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులనుండి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట మేలుచేస్తుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. రావల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం పెద్దలనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, సాధ్యమైనంత మేర ప్రయాణాలు చేయకపోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మొండిబకాయిలు కొంత మేర వసూలు అయ్యే ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. తల్లితరుపు బంధువులను కలుస్తారు.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రతగా ఉండుట అలాగే శక్తిమేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు, కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలుగుతాయి, వారితో సమయం సరదాగా గడుపుతారు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం కుటుంబంలో సభ్యులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. పెద్దలతో మీకున్న పరిచయం అలాగే సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో ఒక నిర్ణయానైకి వస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం చేపట్టు ప్రయాణ విషయంలో స్పష్టత అవసరం. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మానసికంగా కాస్త దృడంగా ఉండుట సూచన, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. దైవ పరమైన విషయాల్లో సమయం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును, అయినప్పటికీ మీ ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళుట సూచన. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు కొంతమందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
annavaram satyadevudu