Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Is it at risk?

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్‌ఎక్స్‌100 హీరోతో ఊర మాస్‌ డైరెక్టర్‌

Ura  Mass Director

బోయపాటి సినిమా అంటే మాస్‌ పల్స్‌ని గట్టిగా టచ్‌ చేస్తుందనే అభిప్రాయం అందరిలోనూ వుంది. హీరోయిజం లెవల్స్‌ ఆకాశాన్నంటేలా ఉంటాయి బోయపాటి సినిమాల్లో. హీరో క్యారెక్టరైజేషన్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ, ఇటీవల మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో బోయపాటి తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' సినిమా లెక్కలు తప్పింది. అంచనాలు తారుమారయ్యాయి. పూర్తిగా ఈ లోపం బోయపాటిదే అని అంతా తేల్చేశారు. 'వీవీఆర్‌' తర్వాత బోయపాటి బాలయ్యతో సినిమా చేస్తారనుకున్నారు. కానీ, బాలయ్య, బోయపాటికి హ్యాండిచ్చి కె.ఎస్‌.రవికుమార్‌ వైపు మొగ్గు చూపడంతోఅంతా షాకయ్యారు. బోయపాటి అయితే ఇంకా ఎక్కువ షాక్‌ అయ్యాడు. దాంతో బోయపాటి కొత్త ఆలోచన చేస్తున్నాడట.

యంగ్‌ హీరో కార్తికేయతో ఓ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాడట. బోయపాటితో సినిమా అంటే ఎగిరి గంతేసిన కార్తికేయ వెంటనే ఓకే చెప్పేశాడట కూడా. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో కార్తికేయలో జోష్‌ ఓ లెవల్‌లో వుంది. ఇక బోయపాటి సినిమా అంటే నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకున్నట్లే. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందట. ఇదిలా ఉంటే, కార్తికేయ ప్రస్తుతం 'హిప్పీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. మరోవైపు 'గుణ 369' అంటూ కార్తికేయ హీరోగా ఇంకో కొత్త సినిమా కూడా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. వీటితో పాటు, నాని హీరోగా తెరకెక్కుతోన్న 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సో కార్తికేయ డైరీ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా కనిపించడం లేదండోయ్‌. ఈ బాబు బాగా బిజీ.! 

మరిన్ని సినిమా కబుర్లు
Beauty is doing this.