Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

17-05-2019 నుండి 23-05-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. తండ్రితరుపును బంధువులను కలిగి ఉంటారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మానసికపరమైన ఇబ్బందులు కొంత మిమల్ని ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. బంధువుల సూచనలను పరిగణలోకి తీసుకోండి , నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలలో పాల్గొనే అవకాశం ఉంది. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడిపే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనవసరమైన విషయాలకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండుట సూచన. నిర్ణయాల్లో స్పష్టత అవసరం.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. బంధువులను కలుసుకుంటారు , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. కోపం వలన నష్టపోయే అవకాశం ఉంది , సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వాహనాలు వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువులను కలుసుకుంటారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది, మొండి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం కుటుంబంలో పెద్దల సూచనల మేర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. సంతానం నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. వారి ఆలోచనలు మీతో పంచుకొనే ఆస్కారం ఉంది. మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో ఎటువంటి మాట పట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం వలన మేలుచేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీ వచ్చే అవకాశం ఉంది. 
 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. విద్యార్హులకు మంచి కాలం స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. సొంతనిర్ణయాల కన్నా ఇతరులకు చేసే పనులను శ్రద్ధతో పూర్తిచేయుట సూచన. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చూస్కోండి. సర్దుబాటు విధానం మంచిది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.  

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీకోపం వలన నష్టపోతారు. సోదరుల విషయంలో మీ ఆలోచనలు పంచుకుంటారు, కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తలపెట్టే పనుల విషయంలో స్పష్టత అవసరం. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సొంతనిర్ణయాలకు అధికప్రాధాన్యత ఇస్తారు. చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రావాల్సిన ధనమ్ సమయానికి చేతికి అందుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకశాహ్మ్ ఉంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

 ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలన వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబవ్యవహారాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల నుండి బంధవులు వచ్చే అవకాశం ఉంది, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం చేపట్టు ప్రయాణ విషయంలో స్పష్టత అవసరం. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మానసికంగా కాస్త దృడంగా ఉండుట సూచన, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. దైవ పరమైన విషయాల్లో సమయం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాలకు సమయం ఇస్తారు, పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం వలన పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, గతంలో రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. సోదరులతో కలిసి చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అనుకోకుండా పనులు మీద పడే అవకాశం ఉంది, భాద్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర సమయం చర్చలకు ఇస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తచేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది.
 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
pen cartoons