Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ismart   puri

ఈ సంచికలో >> సినిమా >>

మోడ్రన్‌ సీత కథ: అంచనాల్ని పెంచేసింది కదా.!

modern seeta

నిన్న మొన్నటి దాకా 'సీత'ను చాలా లైట్‌ తీసుకున్నారండోయ్‌. కానీ సీత ఏమంత తక్కువ కాదు. విడుదల దగ్గర పడేసరికి సీత తడాఖా చూపిస్తోంది. ప్రమోషన్స్‌ జోరు పెరిగింది. ఇన్నోవేటివ్‌గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. పేరుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరో అనే కానీ, 'సీత'ను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ప్రమోట్‌ చేస్తున్నారు. అన్నింటికీ మించి కాజల్‌ అగర్వాల్‌ని తేజ 'సీత' పాత్ర కోసం ఎంచుకోవడంలోనే ఆయన పెద్ద స్కెచ్‌ ఏదో వేశారని తెలుస్తోంది. గతంలో బెల్లంకొండతో కలిసి కాజల్‌ అగర్వాల్‌ 'కవచం'లో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకోలేదు. 'సీత' మాత్రం అలా కాదు, మ్యాజిక్‌ చేసేలానే ఉంది. తేజతో కాజల్‌ అగర్వాల్‌ వరుసగా రెండో సినిమాలో నటిస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తేజ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాడు. ఈ సినిమాతోనే తేజ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు కూడా. అదే సెంటిమెంట్‌తో కాజల్‌తో 'సీత' ప్లాన్‌ చేశాడు.

నిజానికి తేజ మధ్యలో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ చేయాల్సి ఉంది. కానీ తానొకటి తలిస్తే, దైవమొకటి తలచింది అన్నట్లుగా, తేజకు సక్సెస్‌ రాత మరోసారి కాజల్‌ చేతిలోనే రాసుందేమో.. అందుకే బలవంతంగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ వైపు వెళ్లినా, తిన్నగా మళ్లీ 'సీత' కోసం వచ్చేశాడు. ఇందుకు కారణమేదైనా కావచ్చు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో పోల్చితే, 'సీత' మోర్‌ ఇంటెన్సిటీతో ఉంటుందట. సోలో రిలీజ్‌ 'సీత'కు అన్నింటికంటే బాగా కలిసొచ్చే అంశం. ఈ నెల 24న వరల్డ్‌ వైడ్‌గా 'సీత' ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Chances of plundering srinath