Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఎబిసిడి చిత్రసమీక్ష

ABCD movie review

చిత్రం: ఎబిసిడి - అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ 
నటీనటులు: అల్లు శిరీష్‌, రుక్సార్‌ థిల్లాన్‌, భరత్‌, నాగబాబు, రాజా, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: రామ్‌ 
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 
సంగీతం: జుదా శాండీ 
దర్శకత్వం:: సంజీవ్‌ రెడ్డి 
సమర్పణ: డి. సురేష్‌బాబు 
నిర్మాణం: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ 
నిర్మాతలు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని 
విడుదల తేదీ: 17 మే 2019

క్లుప్తంగా చెప్పాలంటే.. 
అమెరికాలో పుట్టి పెరిగిన 'పోష్‌' కుర్రాడు అరవింద్‌ అలియాస్‌ అవి (నాని). డబ్బున్న కుటుంబానికి చెందినవాడు కావడంతో జల్సాలతో లైఫ్‌ గడిపేస్తుంటాడు. అరవింద్‌ తండ్రి (నాగబాబు) కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు.. మిలియనీర్‌గా అమెరికాలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. అయితే తన కొడుకు విషయంలో కొంత ఆందోళనతో వుండే ఆ తండ్రి, తన కొడుక్కి డబ్బు విలువ తెలియాలని కోరుకుంటాడు, ఇందుకోసం ఇండియాకి పంపిస్తాడు. అక్కడ కేవలం నెలకు 5 వేల రూపాయలతో ఎలా జీవితాన్ని గడపాలో తెలుసుకోమంటాడు. ఇండియాకి వచ్చాకే తన తండ్రి ప్లాన్‌ అర్థమవుతుంది అరవింద్‌కి. అంతే షాకవుతాడు, ఆ తర్వాత సర్దుకుపోతాడు. 5 వేలతో స్లమ్‌లో అరవింద్‌ జీవితం ఎలా సాగింది? ఈ క్రమంలో పరిచయమైన నేహా (రుక్సార్‌)తో ప్రేమ వ్యవహారం ఏమయ్యింది? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే.. 
సినిమా సినిమాకీ నటుడిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతున్నాడు అల్లు శిరీష్‌. 'ఒక్క క్షణం' సినిమాలో చాలా మెచ్యూర్డ్‌గా కన్పించిన శిరీష్‌, ఇందులో భిన్న కోణాలున్న పాత్రలో అలరిస్తాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు అతను పడ్డ కష్టం తెరపై కన్పిస్తుంది. జల్సారాయుడిలా, కనీస ఖర్చుల కోసం సతమతమయ్యే సామాన్యుడిలా వేరియేషన్స్‌ బాగా చూపించాడు. 
శిరీష్‌ స్నేహితుడిగా నటించిన ఒకప్పటి బాల నటుడు భరత్‌, ఇకపై ఇలాంటి పాత్రలకు బెస్ట్‌ ఆప్షన్‌ అన్పిస్తాడు. చిన్నప్పుడే మంచి కామెడీ టైమింగ్‌తో సత్తా చాటిన భరత్‌, ఇందులో ఇంకాస్త పరిణతి ప్రదర్శించాడు.

హీరోయిన్‌ రుక్సార్‌ మీర్‌ గ్లామరస్‌గా కన్పించింది. నేచురల్‌ బ్యూటీ అనదగ్గ ఫీచర్స్‌ ఆమెలో చాలానే వున్నాయి. మంచి అవకాశాలు దొరికితే, స్టార్‌డమ్‌ సొంతం చేసుకునే లక్షణాలు ఆమెకున్నాయి. నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రుక్సార్‌. నాగబాబు, రాజా, శుభలేఖ సుధాకర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. వెన్నెల కిషోర్‌ కామెడీ ఈ సినిమాకి మరో మెయిన్‌ హైలైట్‌. మిగతా పాత్రధారులంతా ఓకే అన్పిస్తారు.

కథ కొత్తదేమీ కాదు. కథనం పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేదన్పిస్తుంది. డైలాగ్స్‌ ఓకే. ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పాల్సి వుంది. సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. నిర్మాణపు విలవలు చాలా బాగున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి.

సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకి 'పిల్ల జమీందార్‌' సినిమా గుర్తుకొస్తుంది. కామెడీ, ఎమోషన్స్‌ ఆ స్థాయిలో పండి వుంటే, ఈ సినిమా ఇంకో లెవల్‌కి వెళ్ళి వుండేదే. కామెడీకి బోల్డంత ఆస్కారమున్నా, దర్శకుడు ఎందుకో సరిగ్గా ఆ స్లాట్‌ని వినియోగించుకోలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం కామెడీ బాగానే పేలింది. అదే సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. నెలకి 5 వేల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ పెయిన్‌కి తగ్గట్టుగా హీరో వేషధారణ కుడా వుండేలా జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది. వెన్నెల కిషోర్‌ కామెడీ పండటం శిరీష్‌ - భరత్‌ మధ్య కామెడీ ట్రాక్‌ వర్కవుట్‌ అవడం, రుక్సార్‌ థిల్లాన్‌ గ్లామర్‌.. ఇవన్నీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఫన్‌తో కూడిన ఓ సరదా అనుభవం అయితే సినిమా చూశాక కలుగుతుంది.

అంకెల్లో చెప్పాలంటే..
3.5 /5

ఒక్క మాటలో చెప్పాలంటే..
ఎబిసిడి - కామెడీ, ఇంకా ఎక్కువ కావాలండీ..  

మరిన్ని సినిమా కబుర్లు
churaka