Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Where is Children Films

ఈ సంచికలో >> సినిమా >>

తోడి కోడళ్ళు - మృగరాజు, రాంబాబు

thodikodallu - mrugaraju, rambabu

అప్పుడెప్పుడో వచ్చిన ‘తోడికోడళ్ళు’ సినిమాలో ‘టౌను పక్కకెళ్ళొద్దు రా...’ అప్పట్లో పెద్ద సంచలనం. ఆ పాట తరహాలో ఇప్పటికీ పాటలు
వస్తున్నాయంటే ఆ పాట గొప్పతనం అలాంటిది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మృగరాజు’ సినిమాలో ‘దమ్మెంతో చూపించరా..’ అంటూ సాగే పాట కూడా, ‘తోడి కోడళ్ళు’లోని ‘టౌను పక్కకెళ్ళద్దురో..’ పాట రూట్ లోనే సాగుతుంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలోనూ ‘తోడికోడళ్ళు’ పాటను పోలేలాగానే వుంటుంది ‘ఏటేటో ఐపోతోందో.. రాంబాబు..’ అనే పాట. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లోని ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుందన్న విషయం తెలిసినదే కదా.

కొత్త కొత్తగా పాటలొస్తున్నా, పాత సినిమాల్లోని పాటల ఫ్లేవర్ ఎంతో కొంత తగులుతోందంటే అలనాటి ఆణిముత్యాల గొప్పతనమే అది. కొత్త ట్యూన్ లు, కొత్త టెక్నాలజీ అంటూనే పాత సినిమా పాటల్ని అటూ ఇటూగా మార్చి దంచేస్తున్నారు ఇప్పటితరం సంగీత దర్శకులు అనడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

మరిన్ని సినిమా కబుర్లు
Tollywood hit movies in 2013