Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
thodikodallu - mrugaraju, rambabu

ఈ సంచికలో >> సినిమా >>

2013లో హిట్టయిన చిత్రాలు

Tollywood hit movies in 2013

ఈ ఏడాది సక్సెస్ ల పరంగా తెలుగు సినిమా భేషుగ్గానే వున్నట్లు కనిపిస్తోంది. ‘నాయక్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు ఘనమైన ఆరంభం లభించింది. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే, అందులో ఏదో ఒకటే మంచి ఫలితాన్నిస్తుందనే సెంటిమెంట్ కి భిన్నంగా, సంక్రాంతి రేసులో నాయక్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం సాధించాయి.

ఆ తరువాత కూడా వసూళ్ళ పరంగా తెలుగు సినిమా కళకళ్ళాడిందనే చెప్పవచ్చు. ‘మిర్చి’ సాధించిన విజయంతో తెలుగు సినీ పరిశ్రమలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ‘స్వామిరారా’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ‘తడాఖా’ నాగచైతన్యకి మంచి ఊపునిచ్చింది. ‘ప్రేమకథా చిత్రం’ విమర్శకుల ప్రశంసలనీ, నిర్మాతకి కాసుల పంటనీ, దర్శకుడికి కొత్త ఇమేజ్ నీ తెచ్చింది. అంతకు ముందు డీలా పడ్డ రవితేజకి ‘బలుపు’ కొత్త బలాన్నిచ్చిందని చెప్పవచ్చు. గోపీచంద్ కూడా ‘సాహసం’తో ఊపిరి పీల్చుకున్నాడు. ‘పోటుగాడు’తో మనోజ్ ఫర్వాలేదన్పించాడు. ‘దూసుకెళ్తా’ సినిమాతో విష్ణు కూడా హ్యాపీనే.

ఈ ఏడాది సూపర్ సక్సెస్ విషయానికి వస్తే, ‘అత్తారింటికి దారేది’ ట్రెండ్ మార్చేసింది. విడుదలకు ముందే సినిమా పైరసీకి గురైనా, పైరసీ దారులకే మైండ్ బ్లాంక్ చేసే వసూళ్ళను సాధించింది ఈ సినిమా. పైరసీ దెబ్బ కొట్టకుండా వుంటే, అవలీలగా 100 కోట్ల మార్క్ దాటేసి, ఆ రికార్డ్ సృష్టించిన తొలి తెలుగు సినిమాగా వార్తల్లోకెక్కేదే.

నిరాశ పర్చిన సినిమాలూ ఎక్కువగానే వున్నా, అనూహ్య, సంచలన విజయాలే ఎక్కువ నమోదయ్యాయి ఈ 2013లో. ఇంకా రెండు నెలల సమయం వుంది ఏడాది ముగియడానికి, ఈలోగా ఇంకెన్ని విజయాలు నమోదవుతాయో.

మరిన్ని సినిమా కబుర్లు
writing telugu film songs in singapore