Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tollywood hit movies in 2013

ఈ సంచికలో >> సినిమా >>

సింగపూర్ లో తెలుగు పాటల సృష్టి

writing telugu film songs in singapore

గోతెలుగు.కామ్ సమర్పణలో రూపొందుతున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమాకి సంబంధించి పాటల సిట్టింగ్ సింగపూర్ లో జరుగుతోంది. గేయ రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు రఘు కుంచె సింగపూర్ కి వెళ్ళి, అక్కడే పాటల గురించి డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఒక పాటకు సంబంధించి మేకింగ్ వీడియో కూడా తీసారట. ఆ అరుదైన అంశానికి ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్ ’ సినిమా వేదికైంది.

 

కొత్త పాయింట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, అడవి శేష్, స్నేహగీతం చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మంజునాథ్ తెరకెక్కిస్తున్నారు. షిరిడి సాయి కంబైన్స్ పతాకం పై మధుర శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతోంది ‘లేడీస్ అండ్ జంటిల్ మెన్ ’.

మరిన్ని సినిమా కబుర్లు
All eyes on Anushka