Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
writing telugu film songs in singapore

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క మీదే కళ్ళన్నీ

All eyes on Anushka

స్టార్ హీరోలకు ధీటుగా అనుష్క సినిమాపై అంచనాలు వుంటోన్న రోజులివి. ‘అరుంధతి’ తర్వాత అనుష్క ఇమేజ్ అంత గొప్పగా మారిపోయింది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వర్ణ’, ‘రుద్రమదేవి’ సినిమాలపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఈ రెండు సినిమాలూ యాభై కోట్ల రూపాయల పైబడిన బడ్జెట్ తో రూపొందుతున్నవే. ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి, ప్రభాస్ వంటి పెద్ద తలకాయల ఇమేజ్ వున్నా, అనుష్క కోసం ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నవారూ వున్నారు.

మూడు సినిమాలు.. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నవి కావడం, మూడు సినిమాల్లోనూ అనుష్క కత్తి పట్టడంతో, అనుష్క ఈ సినిమాల్లో ఎంత గొప్పగా చేసిందోననే ఆసక్తి అందరిలోనూ వుంది. తెలుగులోనే కాక, తమిళంలోనూ అనుష్క తర్వాతే ఎవరైనా ఇలాంటి పాత్రలకు. కాదు కాదు, అనుష్క కాకుండా ఇంకెవర్నీ అలాంటి పాత్రల్లో ఊహించుకోలేం.

అందుకే అనుష్క ఆ సినిమాలకు అదనపు పబ్లిసిటీ థింగ్ గా మారిపోయిందనడం అతిశయోక్తి కాదు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తున్న మూడు సినిమాలతో అనుష్క యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
tribute to AVS