Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tribute to AVS

ఈ సంచికలో >> సినిమా >>

చక్కనమ్మ చిక్కినా అందమే

charmi lose weight

చాలా తక్కువ వయసులో సినిమా రంగంలోకి వచ్చిన ఛార్మి, చాలా ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగులో వెలిగింది, వెలుగుతూనే వుంది. ఐటమ్ సాంగ్స్ నుంచి గెస్ట్ రోల్స్ వరకూ అన్నీ చేసినా, హీరోయిన్ గా అవకాశాలు ఆమెకు అలాగే వున్నాయి. సోలో హీరోయిన్ గానూ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఛార్మి ఒకప్పుడు.

బాగా లావెక్కిపోవడంతో అది కాస్తా కెరీర్ కి ఇబ్బందికరంగా మారిందని భావించిన ఛార్మి, ఇప్పుడు స్లిమ్ అవతార్ లోకి వచ్చేసింది. వావ్ .. ఛార్మి వయసు జస్ట్ 20 అన్నట్టుగా తయారైందిప్పుడు. చక్కనమ్మ చిక్కినా అందమే అని ఊరికినే అనలేదు కదా. ఈ స్లిమ్ లుక్ తో యంగ్ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇస్తానంటోంది ఛార్మి.

ప్రస్తుతం ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయంటోన్న ఛార్మి, బాలీవుడ్ లోనూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. గ్లామర్ విషయంలో ఛార్మికి ఎప్పుడూ మొహమాటల్లేవు. ఆ విషయాన్నే స్లిమ్ లుక్ తో ఫొటోసెషన్ కి పోజులిస్తూ, ఆ ఫొటోలతో చెప్పకనే చెబుతోంది ఛార్మి. ఛార్మి స్లిమ్ లుక్ కి యువతరం ఫిదా అయిపోవడం ఖాయమే.. అనే రేంజ్ లో గ్లామర్ వుంది ఆ ఫొటోల్లో.

మరిన్ని సినిమా కబుర్లు
no tensions for collections