Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charmi lose weight

ఈ సంచికలో >> సినిమా >>

డబ్బుకి ఢోకా లేదుగానీ

no tensions for collections

సంచలనాల రామ్ గోపాల్ వర్మలో మునుపటి ‘పదును’ లేదనే విమర్శలు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలను చూసి అతని అభిమానులే అంటున్నారు. సక్సెస్ , ఫెయిల్యూర్ అనేవి ఏ దర్శకుడికైనా మామూలే. కానీ వర్మ లాంటి దర్శకుడినుంచి కొంచెం కొత్తగా ఆశిస్తారు అతని అభిమానులు, సామాన్య ప్రేక్షకులు. వాటిని అందివ్వడంలో వర్మ సఫలం కాలేకపోతున్నారు.

అయినప్పటికీ వర్మ సినిమా వసూళ్ళకు ఢోకా వుండడంలేదు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య'2’ సినిమా అంచనాలను అందుకోనప్పటికీ, వసూళ్ళ పరంగా సేఫ్ జోన్ లో వున్నట్లుగా తెలుస్తున్నది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం, వర్మ ఇమేజ్ ‘సత్య'2’కి ప్లస్ పాయింట్స్ గా మారాయి. హిందీ, తెలుగు వెర్షన్లు రెండూ సేఫ్ గానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినట్లుగా చెబుతున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు.

డబ్బులకు ఢోకా లేదని వర్మ అభిమానులు సరిపెట్టుకోరు కదా. వర్మ నుంచి వారు కొత్తదనం ఆశిస్తారు. ఆ కొత్తదనం వర్మ ఇవ్వగలిగితే, తన అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆయన తెలుసుకోగలిగితే వర్మ నుంచి అద్బుతాలు వస్తాయని, ఇంకా వర్మలో ఆ పదును లోలోపల దాగే వుందని అంటున్నారు సినీ విమర్శకులు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam