Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (నవంబర్ 15 - నవంబర్ 21) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆలోచనలు పెరుగుటకు అవకాశం కలదు. కావున అనవసరమైన విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలు జరుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. బంధుమిత్రుల విషయంలో నూతన ప్రస్తావనలు తేకపోవడం చలవరకు ఉత్తమం. శని, ఆదివారాల్లో భోజనానికి ప్రాముఖ్యతను ఇస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు.  తలపెట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. సోమ, మంగళవారాల్లో మాటలను పొదుపుగా వాడుట అనేది సూచన. వ్యాపారంలో ఆశించిన విధంగా ఉండకపోవచ్చును, కావున కొంత నెమ్మదించుట వలన మేలు జరుగుతుంది. మితంగా భుజించుట మంచిది. పనులను పూర్తిచేసే విషయంలో సరైన ప్రణాళికను కలిగి ఉండుట మేలు చేస్తుంది. బుధ, గురువారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు.  వారితో సమయాన్ని గడుపుతారు, వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం కలదు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులలో ముందుకు వెళ్తారు. మొత్తంమీద చేపట్టినపనులలో శ్రమను పొందుటకు అవకాశం కలదు. కష్టములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద కూడదు. సమయానికి భోజనం చేయుట మంచిది అదేవిధంగా ఇష్టమైన పదార్థాలను మితంగా భుజించుట మేలు. మీ ఆలోచనల విషయాల్లో కొంత వ్యతిరేకతను పొందుతారు సర్దుకోండి. అధికారుల విషయంలో మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును.  కావున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. బంధువులతో ప్రతి విషయాన్ని పంచుకోవడం మంచిది కాదు అని గుర్తుంచుకోండి. పెద్దల పట్ల అభిమానాన్ని కలిగి ఉండే ఆస్కారం కలదు, వారి మాటలను గౌరవించుట ఉత్తమం.  

వృషభ రాశి
ఈరోజు మీరు శుక్రవారం రోజున బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు, భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. మధురపదార్తముల యందు ఆసక్తిని కలిగిఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు అవకాశం కలదు. శని, ఆదివారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వలన తప్పక మేలు జరుగుతుంది. అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది.  వాటిని సాధ్యమైనంత వరకు నియత్రించుట వలన ఇబ్బందులు తొలగుటకు అవకాశం కలదు. స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో మీకు అనుకూలమైన వారితో సమయాన్ని గడుపుతారు. కొంత నిదానంగా మీ ఆలోచనల్లో పదను పెంచుకొనే ప్రయత్నం మంచి ఫలితాలు కలుగుటకు సహాయపడుతుంది. శరీరసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు, నూతన అవాకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానేఉంటుంది. బుధ, గురువారాల్లో మాటలను ఆచితూచి వాడుట మేలు. అనారోగ్యం వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. మిత్రులతో నిదానంగా వ్యవహరించుటవలన తప్పక మేలు జరుగుతుంది. వారంమొత్తం మీద చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో ఉత్సాహంను కోల్పోకుండా ఉండటం అనేది మంచిది. సంతానం విషయంలో కొంత ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చును జాగ్రత్త. వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. పనులలో శ్రమను కలిగి ఉంటారు పనులు నిదానంగా పూర్తియ్యే అవకాశం ఉంది. నూతన వస్త్రప్రాప్తిని కలిగిఉంటారు. సమావేశాలలో పాల్గొనే అవకాశం కలదు వాటిపట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ధార్మికసంభంద విషయాలకు సమయాన్ని ఇవ్వడం మూలాన తప్పక మేలుజరుగుతుంది. పెద్దలను కలిసే అవకాశం ఉంది వారిమూలన లాభంను పొందుతారు.

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన పనులకు సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో నూతన పనులకు శ్రీకారం చేయుటకు కలదు. శని, ఆదివారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యంను ఉంటారు, మృష్టాన్నభోజనం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోమ, మంగళవారాల్లో కొంత పని ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. సరైన ఫలితాలు రాకపోవడం మూలాన కొంత ఎక్కువగా ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో అకారణంగా ఖర్చులు కలిగి ఉంటారు. బుధ, గురు వారాల్లో పెద్దల సహకారం చేత పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. నచ్చిన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. నలుగురిలో మీ ఆలోచనలకు గుర్తింపును పొందుతారు. వారం మొత్తం మీద ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు చేయాలనే ఆలోచన చేస్తారు. కాకపోతే పెద్దల సూచనలు పాటించుట మంచిది. గతకొంతకాలంగా మీరు ఆశిస్తున్న పనులను పూర్తిచేస్తారు. సౌఖ్యమునకు ప్రాధాన్యత ఇస్తారు. అకారణంగా ఏర్పడు కలహముల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం మంచిది. ఉద్యోగంలో పనిభారంను కలిగి ఉండే అవకాశం ఉంది ఓపిక అవసరం. కుటుంబంలో తీసుకొనే నిర్ణయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి. తద్వార వివాదములు తగ్గుటకు ఆస్కారం కలదు.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబ పరంగా నూతన ఆలోచనలు చేయకండి, కుటుంబసభ్యులలో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. కావున అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. శని, ఆదివారాల్లో ఉద్యోగంలో అధికారులతో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఖర్చును కలిగి ఉన్నను ఆదాయం ఉండటం మూలాన ఇబ్బంది తగ్గుటకు ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోమ, మంగళవారాల్లో అనుకున్న పనులను పూర్తిచేసే అవకాశం కలదు. బంధవులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు, వారితో కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. నచ్చిన పదార్థములను భుజించే అవకాశం కలదు. ప్రయాణాలు చేయవలసి రావచ్చును. శ్రమను కలిగి ఉన్నను సంతోషాన్ని పొందుతారు. బుధ, గురువారాల్లో గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఒత్తిడిని కలిగి ఉంటారు. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో సంప్రదాయకంగా వ్యవహరించుట మూలాన మేలు జరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులకు పోకపోవడం సూచన. వారం మొత్తం మీద నూతన ప్రయత్నాలను ఆరంభించక పోవడం మూలాన మేలు జరుగుతుంది. బంధువులతో కలిసి పనిచేయవలసి వచ్చిన సందర్భంలో నిదానంగా వ్యవహరించుట వారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. ప్రయత్నాలు మొదటి సారిగా పూర్తికాకపోవచ్చును ఒకటికి రెండు ప్రయత్నాలు చేయండి మంచిది. మాత్రువర్గం నుండి నూతన విషయాలు తెలిసే అవకాశం ఉంది, తల్లితో కలిసి నూతన విషయాలపరంగా చర్చచేస్తారు. దైవసంబంద పనులకు సమయాన్ని ఇవ్వడం సూచన. సంతానపరంగా ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది.
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున స్వల్ప ఆరోగ్య  సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట అలాగే మంచి ఆహారాన్ని తీసుకొనే ప్రయత్నం చేయండి మంచిది. శత్రువుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును, పనిభారంను పొందుతారు. శని, ఆదివారాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టకండి. పనులపైన ప్రత్యేక శ్రద్ధను చూపుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుట చేత కొంతమేర సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. మరొకప్రదేశంలో నివశించవలసి రావోచ్చును, స్థానచలనం కలిగి ఉంటారు. ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం అనుకూలిస్తుంది. సోమ, మంగళవారాల్లో అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలను ఆరంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగుదల ఉండటం చేత కొంత కోలుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనుల మూలాన అధికారుల గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. బుధ, గురువారాల్లో బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుతారు. నచ్చిన పనులను చేపడుతారు ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. వారం మొత్తం మీద అనుకున్న ప్రయాణాలు ఆటంకాలు పొందు అవకాశం కలదు. కుటుంబంలో స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. కావున నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. గాయములు అయ్యే అవకాశం ఉంది. కావున ప్రతిపనిని అలాగే ప్రతివిశయంలో తగిన జాగ్రతలు చేపట్టండి. వ్యతిరేకవర్గం నుండి చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు. వారి ఆలోచనలు పాటించుట మూలాన ముందు ముందు లబ్దిని పొందుటకు అవకాశం ఉంటుంది. భోజనం విషయంలో మీకంటూ ప్రత్యేక ఇష్టాలను కలిగి ఉంటారు.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొనే విధంగా ప్రయత్నాలు చేయుట మంచిది. శని, ఆదివారాల్లో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో మంచిఆహార నియమాలను పాటించే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మోకాళ్ళ నొప్పుల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. సరైన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. సోమ, మంగళవారాలలో కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట, వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మేలు జరుగుతుంది. బుధ, గురువారాల్లో అనుకున్నపనులు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ధనము సమయానికి సర్దుబాటు అవడం చేత కొంత ఇబ్బందులు తగ్గుతాయి. అధికారులకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేపట్టుటకు అవకాశం కలదు. వారంమొత్తం మీద బంధువులను కలుస్తారు. చేపట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో కలిసి చేపట్టిన పనులు మంచి ఫలితాలను కలుగజేయుటకు అవకాశం కలదు. దేశసంచారం చేయవలసి రావచ్చును, ప్రయాణాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. మంచి పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. సహకారం అందటం చేత పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. వారికి అనుగుణంగా నడుచుకోండి. కుటుంబంలో పెద్దరికం కలిగిఉండేలా ప్రయత్నం చేయండి.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబ జీవితంలో సౌఖ్యంను కలిగి ఉంటారు. నూతన ఉత్సాహంను కలిగి ఉండి పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో అందరిలో గుర్తింపు కోసం నూతన ప్రయత్నాలు మొదలు పెట్టు అవకాశం కలదు. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. మీ వలన ఇతరలు సహాయం పొందుటకు అవకాశం కలదు. సోమ, మంగళ వారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట మంచిది. నూతన ఆలోచనలు చేయకండి. ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట వలన మేలు జరుగుతుంది. బుధ, గురువారాల్లో కుటుంబ సభ్యులతో నిదానంగా వ్యవహరించుట మూలాన మేలు జరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చును సమయాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నం మంచిది. వారంమొత్తం మీద వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. స్వల్పఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. కావున తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ధనము విషయంలో కొంత అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యముల యందు విజయంను పొందుటకు అవకాశం ఉంది. చంచల మనస్సును కలిగి ఉంటారు. స్థిరమైన ఆలోచన చేయుట మంచిది. పెద్దల మూలాన తప్పక సహకారం పొందుతారు. వ్యతిరేకవర్గం విషయంలో తప్పక జాగ్రత్తగా వ్యవహరించుట ఉత్తమం.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఖర్చును పొందుతారు. అదేవిధంగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. కావున సర్దుకుపొండి. తలపెట్టిన పనులు పూర్తికాకపోవచ్చును. దూరప్రదేశప్రయాణాలు అనుకూలించవు. శని, ఆదివారాల్లో పనులలో అధికమైన ఉత్సాహంను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి చిన్న చిన్న సమస్యలు ఎదురయినను పూర్తిచేస్తారు. ధనము విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. సోమ, మంగలవారాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన గౌరవాన్ని పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తప్పక లాభంను పొందుటకు అవకాశం ఉంది. శరీర సౌఖ్యమునకు ప్రాముఖ్యతను ఇస్తారు. భోజనం విషయంలో మీకంటూ కొన్ని ఇష్టాలను కలిగి ఉండే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఆరోగ్యసమస్యలు తప్పక పోవచ్చును. సరైన జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి ఉత్తమం. వారం మొత్తం మీద బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించట మంచిది. భోజనం విషయంలో అశ్రద్దకూడదు సమయానికి భోజనం చేయుట సూచన. స్వల్ప ఆరోగ్యం సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. శరీరబడలికను పొందుతారు. సంచారం చేయుట మూలాన శ్రమను పొందుతారు నిదానంగా ఆలోచనలు చేయుట మంచిది. చిన్న చిన్న విషయాలకే ఆందోళనచెందుతారు. నిదానం అవసరం. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున పనులను ఆరంభించక పోవడం ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు చేయకండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శని, ఆదివారాల్లో ఒకవార్త ఒకింత ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ధనమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగువేయుట మంచిది. సోమ, మంగళవారాల్లో అనుకూలమైన ఫలితాలు పెద్దల ఆశిస్సుల మూలాన పొందుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు వారితో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయండి. ఉత్తమం. బుధ, గురువారాల్లో ధనమునకు సంబంధించిన విషయాల్లో లాభంను పొందుతారు. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుటుంది అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన తప్పక పనులలో విజయంను పొందుతారు. వారం మొత్తం మీద అధికంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చును. శ్రమను కలిగి ఉంటారు. సంచారం చేయుట మూలాన అలసిపోతారు. అదేవిధంగా ధనమును ఖర్చు చేయుటకు అవకాశం ఉంది. మీనచ్చిన వారి ఆరోగ్యంవిషయంలో కొంత ఆందోళన చెందు అవకాశం ఉంది. స్థానచలనం కలుగుటకు అవకాశం కలదు. నచ్చని ప్రదేశంలో ఉండవలసి రావచ్చును సర్దుకుపోవడం మంచిది. పెద్దలతో మంచి సంభందాలు కలిగిఉంటే చాలావరకు మేలుజరుగుతుంది. ఇష్టమైన పనులను పూర్తిచేయుటలో మక్కువను కలిగి ఉంటారు. వాటికీ సమయాన్ని ఇవ్వడం చేస్తారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు, నూతన పరిచయాలు కలుగుతాయి.

మకర రాశి

ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన వారిని కలుస్తారు. నచ్చిన పనులకు సమయాన్ని ఇవ్వడం చేస్తారు. ధనము విషయంలో కొంత వరకు పనులను ముందుకు తీసుకు వెళ్ళు అవకాశం ఉంది. నూతన వస్త్రలాభంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. సమయాన్ని ప్రణాళిక ప్రకారం గడపండి. శని, ఆదివారాల్లో పనులలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావడం మూలాన ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ప్రయత్న కార్యములలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీలైతే వాటిని వాయిదా వేయుట మంచిది. సోమ, మంగళవారాల్లో అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. నూతన పనులను వాయిదా వేయండి. బుధ, గురువారాల్లో పరిస్థితులు కొంత చక్కబడే అవకాశం కలదు. అనుకున్న పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తప్పక లాభం ఉంటుంది. వారం మొత్తం మీద శుభకార్యములలో పాల్గొంటారు. సంతోషంగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. మధుర పదార్థముల విషయంలో ఆసక్తిని కలిగి ఉంటారు. అధికారులను కలుస్తారు వారికి అనుగుణంగా పనులను చేపడుతారు. రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం కలదు. వాహనముల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదములు కలుగుటకు అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చును. అనుకోని వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు. కావున పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోండి. ముఖ్యమైన వస్తువుల విషయంలో అశ్రద్ద చేయకండి.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మాటలు పొదుపుగా వాడే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో అశ్రద్ద చేయకండి. మంచి భోజనాన్ని తీసుకోండి. శని, ఆదివారాల్లో నచ్చిన పనులకు సమయాన్ని గడిపే అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుతారు. చర్చలకు సమయాన్ని ఇచ్చే అవకాశం కలదు. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పనులు కొంత నిదానంగా ముందుకు కదులుతాయి. ఆశించిన వేగం లేకపోవడం మూలాన ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదా వేయడం అనేది సూచన. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభించకపోవడం మంచిది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి నిదానంగా వ్యవహరించుట సూచన. వారంమొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో సమయాన్ని గడుపుతారు. రాజకీయ వ్యవహరాలకు సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వాటిపట్ల ప్రత్యెక దృష్టిని కలిగి ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కలుగుటకు అవకాశం కలదు. కావున మీవైపు నుండి విభేదాలు తగ్గించే ప్రయత్నం అవసరం. కొన్ని విషయాల్లో నిరుత్సాహంను పొందుటకు అవకాశం కలదు. కావున జాగ్రత్త. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు వాటిని అమలుచేసే ప్రయత్నం చేయండి. సమయానికి భోజనం చేయండి.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. సమయాన్ని నచ్చిన విధంగా గడిపే అవకాశం కలదు. నచ్చినవారికి సమయాన్నిఇచ్చే అవకాశముంది. పనులను ముందుకు తీసుకువెళ్ళు ఆలోచనలు చేయండి. అదేవిధంగా నిదానం అవసరం. శని, ఆదివారాల్లో వ్యాపారంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆరోగ్యపరమైన విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి మంచిది. సమయానికి భోజనం చేయండి. పనిఒత్తిడిని కలిగి ఉంటారు. ఫలితాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చును. కావున ఆచితూచి అడుగులు ముందుకు వేయడం ఉత్తమం. సోమ, మంగళ వారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఇష్టమైన వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో పనులలో సమయాన్ని గడుపుట మంచిది. ప్రయాణాలు చేయకపోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. పనుల విషయంలో ఒకటి తరవాత ఒకటి చేయడం మూలాన కొంత ఇబ్బంది తగ్గుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం కలదు. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల నిదానంగా వ్యవహరించుట మంచిది. ఒకవార్త కొంత మానసికంగా భాదను కలిగించేదిగా ఉండే అవకాశం ఉంది. ఆలోచనల్లో తొందరపాటు ఉంటే అపకీర్తిని మూట గట్టుకునే అవకాశం ఉంది. ఇతరులకు సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. కాకపోతే సరైన ప్రణాళిక అవసరం. ధార్మిక కార్యక్రమాలకు సమయాన్ని ఇవ్వడం మంచిది. స్థిరమైన ఆలోచనలు తప్పక మేలుచేస్తాయి. పనులలో శ్రమ తప్పక పోవచ్చును.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Paravastu Chinnayasuri