Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

నా దారి సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటోన్న యంగ్‌ హీరో.!

something special

'మెగాస్టార్‌ చిరంజీవిలా 20 ఏళ్లు హీరోగానే స్ధిరపడాలంటే చాలా కష్టం. మారిన ఆడియన్స్‌ ఆలోచనల దృష్ట్యా నేటి హీరోలు కూడా తమ ఆటిట్యూడ్‌ని మార్చుకోవాలి. విజయ్‌సేతుపతిలా విలక్షణ నటులు అనిపించుకోవాలంటున్నాడు.. యంగ్‌ హీరో కార్తికేయ. ఈయన నటించిన 'హిప్పీ' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. డెబ్యూ మూవీ 'ఆర్‌ఎక్స్‌ 100'తో క్రేజీ హీరో అనిపించుకున్న మనోడు, అదే స్టఫ్‌తో సెకండ్‌ మూవీగా 'హిప్పీ'ని వదిలాడు. కానీ, 'హిప్పీ'తో మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయాడు. కానీ, ఏమో చెప్పలేం స్టఫ్‌ బోల్డ్‌గా ఉంది కాబట్టి, మెల్ల మెల్లగా యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసినా చేసేస్తుంది 'హిప్పీ'. ఈ సంగతి అటుంచితే, మనోడు చాలా తెలివైనోడండీ బాబూ. ఒకే జోనర్‌కి ఫిక్స్‌ అయిపోలేదు. డిఫరెంట్‌ జోనర్స్‌కి కనెక్ట్‌ అవుతున్నాడు. ఓ వైపు హీరోగా దూసుకెళ్తూనే మరోవైపు విలన్‌గానూ టాలీవుడ్‌ని దున్నేయాలనుకుంటున్నాడు.

ఈ జనరేషన్‌ హీరోల్లో ఇలా ఆలోచించేవాళ్లని వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చేమో. ఏది ఏమైతేనేం 'ఐ యామ్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌' అనిపించుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు కార్తికేయ. నాని హీరోగా తెరకెక్కుతోన్న 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తికేయ క్యారెక్టర్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారట. ఈ క్యారెక్టర్‌ చూశాక, విలన్‌ పాత్రలకే కార్తికేయను ఫిక్స్‌ చేసేస్తారేమో అనేంతలా ఆ పాత్రకు ప్రాణం పోసేశాడట కార్తికేయ. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలో కార్తికేయ లుక్కే చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. చేసినవి రెండే సినిమాలైనా ఆల్రెడీ మనోడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించి కేక పుట్టించేశాడు. మరి ఈ సినిమాలోని కార్తికేయ సరికొత్త లుక్‌ చూడాలంటే మరికొంత సమయం పడుతుందిలే.

మరిన్ని సినిమా కబుర్లు
old is gold