Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
old is gold

ఈ సంచికలో >> సినిమా >>

భళా 'భళ్లా' భళా.. నీకే సాధ్యమల్లా.!

BALA 'BALLA' BALA .. you can do it!

ఈ జనరేషన్‌ హీరోల్లో రానాది డిఫరెంట్‌ శైలి. హీరోగానే కాకుండా, కథ నచ్చితే, క్యారెక్టర్‌ ఏంటనేది అస్సలు చూడడు. తనకిచ్చిన క్యారెక్టర్‌లోకి పరాకాయ ప్రవేశం చేసేస్తాడు. అందుకే విభిన్న పాత్రలను రానా నుండి నిస్సందేహంగా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. దర్శక, నిర్మాతలు కూడా రానాని దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలకు తెర లేపుతుంటారు కూడా. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రానా బిజీగా గడిపేస్తున్నాడందుకే. అలాంటి రానా కోసం తాజాగా ఓ ప్రాజెక్ట్‌ ఎదురు చూస్తోంది. గత నాలుగేళ్లుగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఓ స్క్రిప్టుపై సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నాడు. అదే 'హిరణ్యకశ్యప'. విష్ణు నామమంటే గిట్టని ఈ రాక్షస రాజు కథని తెరకెక్కించాలన్న సంకల్పంతో గుణశేఖర్‌ గ్రౌండ్‌ వర్క్‌ ధిట్టంగానే సిద్ధం చేసుకున్నాడు. ఈ రాక్షసరాజు పాత్ర కోసం ఆయన ఎంచుకున్న హీరో రానా. అవును మరి.. ఆ పాత్ర రానా మాత్రమే చేయగలడు.

ఈ జనరేషన్‌ హీరోల్లో రానాని మాత్రమే అలాంటి పాత్రలో ఊహించగలం. హీరో దొరికేశాడు. ఇక నెక్స్‌ట్‌ ఈ సినిమా పట్టాలెక్కడమే తరువాయి. లేటెస్ట్‌గా గుణశేఖర్‌ ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా చేసేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ లోగా రానా ఇంతవరకూ ఒప్పుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. రానా ప్రస్తుతం తెలుగులో 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీలో 'హాథీ మేరే సాథీ' అనే మూవీలోనూ, తమిళంలో మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తి చేసి, 'హిరణ్యకశ్యప' కోసం టైం కేటాయించనున్నాడట. 'బాహుబలి'లా ఇదో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ కానుంది. గెటప్‌ పరంగా రానా మళ్లీ భళ్లాలదేవగా మారిపోవాల్సి వస్తుంది కూడా. 

మరిన్ని సినిమా కబుర్లు
Who is the hero