Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
o baby movie review

ఈ సంచికలో >> సినిమా >>

షాకిచ్చిన స్వీటీ: ట్రీట్‌ ఇంకా సరిపోలా.!

Shocked sweety

స్వీటీ బ్యూటీ అనుష్క 'సైలెన్స్‌'గా ఫ్యాన్స్‌కి ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసి, 'త్వరలోనే స్పాట్‌లైట్‌లోకి వస్తున్నా.. సైలెన్స్‌..' అనే హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టింది. ప్రస్తుతం స్వీటీ ప్రస్తుతం 'సైలెన్స్‌' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, 'సైరా'లోనూ నటిస్తోంది. అయితే, గత కొన్నాళ్లుగా స్వీటీ సినిమాలకు దూరంగా ఉంటోంది. అందుకు కారణం ఆమె బరువే. ఆ బరువు తగ్గించుకుని, స్లిమ్‌ అయ్యిందనే వార్తలు వచ్చాయి తప్ప. లైవ్‌ అప్‌డేట్‌ ఏమీ బయటికి రాలేదు. ఇదిగో స్వీటీ ఇంత సన్నగా అయ్యిందట. అదిగో అంత సన్నగా అయ్యిందట.. అంటూ ఏవేవో ఫోటోలు బయటికి వచ్చాయి కానీ, అనుష్క లేటెస్ట్‌ పిక్స్‌పై పక్కా క్లారిటీ లేదు. సో అనుష్క ఇప్పుడెలా ఉంది.? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరోవైపు 'సైరా'లో ఆమె వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ పాత్రలో కనిపించనుందట.. అనే టాక్‌ లేటెస్ట్‌గా ప్రచారంలోకి వచ్చింది.

ఇంతవరకూ 'సైరా'కి సంబంధించిన అనుష్క క్యారెక్టర్‌ కథను నెరేట్‌ చేయడమే అన్నారు. కానీ, తాజా అప్‌డేట్‌ ప్రకారం అనుష్క లక్ష్మీభాయ్‌ పాత్రలో కనిపించనుందట అనే టాక్‌ ఆసక్తిని పెంచుతోంది. ఏది ఏమైనా ఆమె పాత్ర కన్నా, ఆమె రూపు రేఖ మీదే ఇప్పుడు ఫోకస్‌ అంతా. చాలా కాలమే కష్టపడి స్వీటీ ఒళ్లు తగ్గించింది. ఒళ్లు తగ్గినాకనే 'సైలెన్స్‌' సినిమా పట్టాలెక్కింది. మరి సన్నబడిన స్వీటీ ఎలా ఉంది.? అంటే స్వీటీనే క్లారిటీ ఇవ్వాలి. అయితే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంకెంతో సమయం ఎదురు చూడక్కర్లేదనిపిస్తోంది. దాదాపు ప్రీ లుక్‌ లాంటి లుక్‌ని రిలీజ్‌ చేసింది అనుష్క 'సైలెన్స్‌' మూవీ నుండి. అంటే అతి త్వరలోనే అనుష్క ఒరిజినల్‌ స్లిమ్‌ లుక్‌ని రివీల్‌ చేయనుందన్న మాట. అంతవరకూ వెయిట్‌ చేయక తప్పదు మరి. మాధవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని సినిమా కబుర్లు
Is that the Saira controversy