Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

5-07-2019 నుండి11-07-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈ వారంలో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభించినను శ్రమను పొందుటకు అవకాశం ఉంది. మాటలు నిదానంగా ఇతరులకు ఇబ్బందిని కలిగించకుండా వాడుట సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి,అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటయిస్తారు. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది అలాగే అగ్నిసమ్భ్నదమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మిత్రుల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. 

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

  ఈవారంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేయుట ద్వార నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది బంధువులతో సరదాగా గడుపుతారు. శుభకార్యముల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది అలాగే గత కొంతకాలంగా ఆగిఉన్న పనులు ముందుకు వెళ్ళుటకు ఆస్కారం కలదు. అగ్నిసంభందవిషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని కలిగిస్తాయి వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా లేకపోతే కొంత ఇబ్బందులను పొందుతారు కొన్ని కొన్ని విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారంలో బంధుమిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని విందులకు,వినోదాలకు గడిపే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది పెద్దల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే సరైన ప్రణాళిక అవసరమ్. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో భాగస్వామి విషయంలో సంతోషకరమైన వార్తలను వినే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయంలో మాత్రం పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మంచిది కొంతకాలం వేచిచుడడం ఉత్తమం. విదేశీప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు కావున ప్రయత్నం పెంచుట మేలు.   చిననాటి మిత్రులను కలవడానికి ఆస్కారం ఉంది.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారంలో సంతానపరమైన విషయాల్లో సంతోషకరమైన వార్తను వినే అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది నూతన ఆలోచనలతో మిత్రులతో కలిసి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు ముందుకు సాగుతాయి గతకొంతకాలంగా ఆగిఉన్న పనులు పూర్తిఅయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులనుండి చర్చాపరమైన విషయాలకు అవకాశం ఉంది వాటికి సమయం ఇవ్వవలసి రావోచ్చును ఈ విషయంలో నిదానంగా ఉండి వారి ఆలోచనలు తెలుసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుటసూచన. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారంలో ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను చిన్న చిన్న సమస్యలను పొందినను చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు కాకపోతే సరైన ప్రణాళిక అసవరం. కుటుంబంలో సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొనే అవకాశం ఉంది అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. పెద్దలతో కలిసి చేయుప్రయత్నాల విషయంలో నిదానంగా లేకపోతే నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. స్త్రీ/పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాటపడవలసి రావోచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారంలో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. పెద్దలతో కలిసి చేసిన చర్చలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. భాద్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. బంధువర్గం నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలో జీవితభాగస్వామికి సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారంలో చేపట్టిన పనులను దాదాపు అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనేటప్పుడు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో శ్రమను పొందుతారు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట సూచన అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వకండి. మీయొక్క ఆలోచన సరళి కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది సర్దుబాటు విధానం కలిగి ఉండుట అనేది మంచిది. బంధువులనుండి నూతన విషయాలు తెలుస్కోనే అవకాశం ఉంది వారిఆలొచనల విషయంలో మరొకసారి తరచి చూసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు వద్దు.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారంలో చేపట్టు పనుల విషయంలో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పనిఒత్తిడి మూలాన స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం కలదు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో సభ్యుల సహకారం మూలాన  పూర్తిచేసే అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి మేలుజరుగుతుంది. ఉద్యోగంలో భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది ఈ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని చేకూరుస్తాయి నూతన పనులను చేపడుతారు. దైవసంభందవిషయాలకు సమయం ఇవ్వండి.     


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారంలో ఆర్థికపరమైన విషయాల్లో మీదైనముద్ర వేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట ద్వార నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపును సంపాదించుకుంటారు. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన భాద్యతలు పెరుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఒక వార్త మిమ్మల్ని కొంత భాధకు గురిచేసిన త్వరగా తేరుకునే ప్రయత్నం చేయుట వలన లబ్దిని పొందుతారు. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో మార్పులకు ఆస్కారం కలదు వాటికి కొంత సమయం ఇవ్వడం సూచన.    
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారంలో మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. మీయొక్క వ్యవహారశైలి ఇతరులను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి వచ్చిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు నలుగురిలో గుర్తింపుకోసం చేయుప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన ఆలోచనలు చేసేముందు కొంత ఆలోచన చేయుట మంచిది. మాటలు జాగ్రత్తగా వాడుట వలన మేలుజరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం పెద్దలను కలిసి ముందుకు వెళ్ళకపోవడం మేలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారంలో ఉద్యోగంలో తలపెట్టిన పనుల్లో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కొత్త కొత్త పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది వారినుండి నూతన అవకశాలు పొందుతారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది జాగ్రత్త కొంత శ్రమను పెంచుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది సమయానికి అనుకూల్మగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారం వలన కొంత మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద పనికిరాదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.  స్త్రీ మూలక విషయాలలో నిదానంగా లేకపోతే మాటపడవలసి రావోచును.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారంలో పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు కాకపోతే మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఉద్యోగంలో శ్రమ తప్పక పోవచ్చును ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళడం మేలు. కుటుంబంలో అనవసరమైన ఖర్చులకు కళ్ళెం  వేయుట మంచిది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట చేత ఇబ్బందులు తగ్గుతాయి. దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల ఆలోచనల మేర నడుచుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది అలాగే ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళుట సూచన.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
sramaviluva