Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial twenty eighth Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

జోర్డాన్ లోని అమ్మన్ అనే ఊరికి చెందిన ఓ దొంగ ఓ బేంక్ లోకి దొంగతనానికి అర్ధరాత్రి చొరబడ్డాడు. తన పని పూర్తి చేసుకున్నాక అతని స్థైర్యం జారిపోవడంతో ఆందోళనగా వున్న మెదడుని సరిచేసుకోవడానికి రెండు స్లీపింగ్ పిల్స్ మింగాడు. అతనా సాయంత్రం ఆల్కహాల్ తాగడంతో ఆ నిద్రమాత్రలు ఇంకాస్త వేగంగా పనిచేసి అక్కడికక్కడే నిద్రపోయాడు. మర్నాడు బేంక్ తలుపు తెరిచేసరికి నిద్రపోతున్న దొంగ ఉద్యోగస్థుల కంటపడ్డాడు.



లాస్ ఏంజెలెస్ కౌంటీ జైలులోని ఓ నేరస్తుడు ఓ లాయర్ ఐడెంటిటీ కార్డును ఫోర్జరీ చేశాడు. తన ఫోటో లేదు కాబట్టి జైల్లో దొరికిన ఓ ఫోటో అతికించాడు. దాన్ని ఉపయోగించి, బయటకి వెళ్ళడానికి ప్రయత్నించినపుడు, దాన్ని పరిశీలించిన గార్డు తేడాను ఇట్టే గమనించాడు. అది ఆ గార్డు తాతయ్య ఫోటోనే. ఎడ్డీ మర్ఫీ అనే హాలీవుడ్ నటుడి ఫోటోనే ఆ నేరస్థుడు ఉపయోగించాడు. ఎడ్డీ మర్ఫీ మనవడే అక్కడ గార్డుగా పనిచేస్తున్నాడు.

 

మరిన్ని సీరియల్స్