Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Mohan Babu

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - వర్ణ

Movie Review - VARNA

చిత్రం: వర్ణ
తారాగణం: అనుష్క, ఆర్య, ఫరూక్‌, సత్యన్‌ శివకుమార్‌, అశోక్‌ కుమార్ తదితరులు
ఛాయాగ్రహణం: రామ్‌జీ
సంగీతం: హేరిస్‌ జైరాజ్‌
నిర్మాణం: పీవీపీ పిక్చర్స్‌
నిర్మాత: పొట్లూరి ప్రసాద్‌
దర్శకత్వం: శ్రీరాఘవ
విడుదల తేదీ: 22 నవంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే
రెండు ప్రపంచాలు.. రెండిటిలోనూ హీరో హీరోయిన్లు. మన ప్రపంచంలో రమ్య (అనుష్క) ప్రేమలో పడ్తాడు మధు (ఆర్య). వేరే ప్రపంచంలో సాధారణ వ్యక్తి (ఆర్య), వర్ణ (అనుష్క)తో ప్రేమలో పడతాడు. రెండు ప్రపంచాలూ కలుస్తాయి. తదుపరి రెండు జంటల ప్రేమ కథ ఏమవుతుంది? వారి ప్రేమ సఫలమైందా? లేదా? రెండు ప్రపంచాల వింతలు విశేషాలు ఏంటి? ఇవన్నీ తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా ఆర్య తన సత్తా చాటుకునేందుకు చాలా ప్రయత్నం చేశాడు. రెండు పాత్రలకూ న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. ఆర్య రెండు పాత్రల్లోనూ జీవించాడు. అనుష్క కూడా సినిమాలో తన పాత్రలకు న్యాయం చేసింది. సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేయడంలో అనుష్క పడ్డ కష్టం తెరపై కన్పిస్తుంది. అనుష్క ఎంత కష్టపడ్డా, ఆ పాత్రని దర్శకుడు సరిగ్గా డిజైన్‌ చేయాలి కదా.? అయితే ఆమె పాత్రల్ని అంత గొప్పగా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు. అశోక్‌ కుమార్. తన పాత్రకు తగ్గ టనటనను ప్రదర్శించాడు. ఫరూఖ్‌ ఓకే, ఇతరుల్లో ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే దక్కాయి.

హాలీవుడ్‌లో వచ్చిన ‘అవతార్‌’ సినిమాని పోలి వుంటుందని ‘వర్ణ’ సినిమా ప్రోమోస్‌ వచ్చాక చాలామంది అనుకున్నారు.  అలా రూపొందించారు ప్రోమోస్‌ని కూడా. అందుకే, హాలీవుడ్‌ అద్భుతం ‘అవతార్‌’కీ, తెలుగు ‘వర్ణ’కీ పోలిక పెట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి వున్న మార్కెట్‌ కారణంగా, ఈ సినిమా హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ది సౌత్‌ సినీ ఇండ్రస్టీ అయ్యింది. అనుష్కతో అత్యంత భారీగా శ్రీరాఘవ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో చాలా ఆసక్తిని రేపింది. కానీ, దర్శకుడిగా ఏ దశలోనూ తనదై ముద్ర వేయలేకపోయాడు శ్రీరాఘవ. స్టోరీ లైన్‌ పూర్తిగా కన్‌ఫ్యూజన్‌తో నిండి వుంది. డైలాగ్స్‌ మరీ పాతగా అన్పిస్తే, నేరేషన్‌ చాలా పూర్‌గా వుంది. ప్రెజెంటేషన్‌ ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమాకి గ్రాఫిక్స్‌ ప్రధాన ఆకర్షణ. ఆ డిపార్ట్‌మెంట్‌ బాగానే వర్క్‌ చేసింది.

ఏతావాతా చెప్పేదేంటంటే, అర్థం పర్థం లేని సినిమా అని ప్రేక్షకులు బోర్‌ ఫీలవుతారు. విచిత్రంగా ఇందులో హీరో చేతిలో ‘సుత్తి’ ఆయుధంగా వుంటుంది. భారీ అంచనాలతో వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టక తప్పని సినిమా ఇది. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు.

మాటల్లో చెప్పాలంటే:  ఏమీ చెప్పలేం.

అంకెల్లో చెప్పాలంటే: 1.5/ 5

మరిన్ని సినిమా కబుర్లు
cini churaka by cartoonist bannu