Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
comedy heros

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌ డైలాగ్‌ రవితేజకి

NTR dailoge for raviteja

ఓ హీరో కోసం తయారుచేసిన కథతో ఇంకో హీరో సినిమా చేయడం, కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద హిట్లవడం, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్‌ చూడటం సినీ పరిశ్రమలో కొత్త కాదు. డైలాగులు కూడా అంతే. ఓ హీరో కోసం చాలా కష్టపడి రాసుకున్న డైలాగ్‌, ఆ హీరోకి నచ్చకపోతే రచయిత అట్టే పెట్టుకుని, కొన్నాళ్ళ తర్వాత ఇంకో హీరోపై ప్రయోగించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది.

కోన వెంకట్‌ అలాంటిదే చేశాడు. 'బాద్‌షా' సినిమా కోసం ఓ డైలాగ్‌ రాసుకున్నాడు కోన వెంకట్‌. ఆ డైలాగ్‌ దర్శకుడు శ్రీనువైట్లకు నచ్చలేదంట. దాంతో, ఆ డైలాగ్‌ పక్కన పెట్టగా, మలినేని గోపీచంద్‌ ` 'బలుపు' సినిమా కోసం ఆ డైలాగ్‌ని వాడుకున్నాడు. ఇల్లు కాలితే ఫైరింజన్‌ వస్తుంది. . ఒళ్ళు కాలితే అంబులెన్స్‌ వస్తుంది. . నీ ఖర్మ కాలితే నేనొస్తాను. . ' ఇది హీరో డైలాగ్‌.

'బలుపు'లో రవితేజ చెప్పిన ఈ డైలాగ్‌కి థియేటర్లలో రెస్పాన్స్‌ బాగా వచ్చింది. ఎన్టీఆర్‌ 'బాద్‌షా' కోసం కోన వెంకట్‌ రాసిన డైలాగ్‌, రవితేజ 'బలుపు'కి ఉపయోగపడిరది. అంతే కాక, డైలాగ్‌ బాగా పేలింది కూడాను.

 

మరిన్ని సినిమా కబుర్లు
Thanikellabharani