Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR dailoge for raviteja

ఈ సంచికలో >> సినిమా >>

తనికెళ్ళ భరణి: నటుడిగా, భక్తుడిగా

Thanikellabharani

తనికెళ్ళ భరణి అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియనివారుండరు. తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారాయన. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ, నెగెటివ్‌ రోల్స్‌లోనూ తనికెళ్ళ భరణి తనదైన ముద్ర వేసుకున్నాడు తెలుగు సినీ పరిశ్రమలో. ఆయన నటుడిగానే కాదు, భక్తుడిగానూ సుపరిచితుడు.

చిన్న చిన్న సినిమాల్ని ఆయన తెరకెక్కిస్తారని కొందరికి తెలుసు. కవిగా, రచయితగా ఆయన మంచి పేరున్న వ్యక్తి. శివ భక్తుడిగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు తనికెళ్ళ భరణి. తెలంగాణ యాసలో ‘శభాష్ రా శంకరా...’ అని ఆయన రాసిన కావ్యం అద్భుతం.

శివ భక్తుల్లో తనికెళ్ళ భరణి తెలియనివారు లేరంటే, అంత గొప్పగా ఆయన మీద శివభక్తుడన్న ముద్ర పడిరది మరి. నటుడిగా, రచయితగా, షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టరుగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తనికెళ్ళ భరణి, శివ భక్తుడిగా పేరు పొందడం బహుశా పూర్వ జన్మ సుకృతం అనుకోవాలలేమో.

మరిన్ని సినిమా కబుర్లు
Allari Naresh