Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Allari Naresh

ఈ సంచికలో >> సినిమా >>

రాంచరణ్‌కి ఆ పాటపై మక్కువ

Ramcharan favourite song

‘మగధీర’ సినిమాలో ‘బంగారు కోడిపెట్ట...’ రీమిక్స్‌, ‘రచ్చ’ సినిమాలో ‘వానా వానా వెల్లువాయె...’, ‘ఎవడు’లో ‘శుభలేఖ రాసుకున్నా..’ ఇలా తన తండ్రి చిరంజీవి నటించగా ఘనవిజయాలు సాధించిన సినిమాల్లోని పాటల్ని చరణ్‌ రీమిక్స్‌ చేసుకుంటూ, అదో సెంటిమెంట్‌గా మార్చేసుకున్నాడు.

ఇక రీమిక్స్‌లు చేయను... అని చరణ్‌ చెబుతున్నప్పటికీ, ఆయనకు బాగా ఇష్టమైన సాంగ్‌ ఇంకొకటి మిగిలిపోయే వుందట. అదే ‘గువ్వా.. గోరింకతో..’ అనే పాట. తన తదుపరి సినిమాలో చరణ్‌ ఈ పాటని రీమిక్స్‌ చేయాలనుకుంటున్నాడనే ప్రచారమైతే తెలుగు సినీ వర్గాల్లో జరుగుతోంది. నిజమో కాదో కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

వాస్తవానికి, చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాల్లో చాలావరకు మ్యూజికల్‌ హిట్స్‌ వున్నాయి, వాటిల్లో సెన్సేషన్‌ సృష్టించిన పాటలైతే చాలా చాలా వున్నాయి. ఇదొక్కటే.. అని చరణ్‌ సరిపెట్టుకున్నా, ఆ తర్వాత ఇంకో పాట చేయాలనే ఆలోచన రావచ్చు. ఖాళీగా వున్నప్పుడు తన తండ్రి నటించిన సినిమాల్లోని పాటల్ని వినడం చరణ్‌కి అలవాటు. అలా కొన్ని పాటలపై అప్పటికప్పుడు ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడి, తన సినిమాల్లో రీమిక్స్‌ చేసుకోవాలనే ఆలోచన వస్తే, దర్శక నిర్మాతలు కూడా కాదనలేరు కదా.
 

మరిన్ని సినిమా కబుర్లు
Senior Actors looking as young