Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Crossing bounds Regina.

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌ కొంచెం తేడా కొడుతోంది బాస్‌.!

Big Boss makes a little difference Boss.!

జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాకా, హౌస్‌లో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. హౌస్‌ నుండి బయటికొచ్చాక, హౌస్‌లో గ్రూప్స్‌ ఫామ్‌ అయిపోయాయని జాఫర్‌ వెల్లడించారు. జాఫర్‌ బయటికి వెళ్లేటప్పుడు హౌస్‌మేట్స్‌ కాస్తంత ఎక్కువే ఎమోషనల్‌ ఫీల్‌ అయ్యారు. నెక్స్ట్‌ డే ఎలిమినేషన్స్‌కి సంబంధించిన నామినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఈ సారి ఓపెన్‌ నామినేషన్స్‌ ప్రక్రియ పెట్టారు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో పునర్నవి సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకుని, కొంత సీన్‌ క్రియేట్‌ చేసింది.

ఈ సీన్‌ పక్కన పెడితే, అసలు విషయం రవికృష్ణ - తమన్నా మధ్యలో జరిగింది. తన వంతుగా తమన్నాని నామినేట్‌ చేశాడు రవికృష్ణ. దాంతో హౌస్‌లో సీన్‌ మొత్తం మారిపోయింది. తనను నామినేట్‌ చేశాడన్న కక్ష్యతో అది గేమ్‌ అన్న సంగతి మర్చిపోయి, ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి తన విశ్వరూపాన్ని బయటికి తీసింది. రవిని పప్పు.. అంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. నువ్వు మగాడివారా.? సిగ్గు లేదురా నీకు.? అంటూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడింది. మధ్యలో బూతులు కూడా వాడేసింది. అనరాని మాటలతో విరుచుకుపడింది. ఏదో గంటా, రెండు గంటలు కాదు..

ఏకంగా రెండు రోజులు రవికృష్ణకి ప్రత్యక్ష నరకం చూపించేసింది. అలా హౌస్‌లో ఈ వారం సూపర్‌ హీట్‌ చోటు చేసుకుంది. అన్నట్లు ఈ వీకెండ్‌ స్పెషల్‌ ఏంటంటే, 'ఇస్మార్ట్‌ శంకర్‌' నుండి రామ్‌, నిధి అగర్వాల్‌ని తీసుకొచ్చి, హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నాగార్జున. వీరి కారణంగా, కాసేపు హౌస్‌మేట్స్‌లో విపరీతమైన జోష్‌ నిండింది. అలా హౌస్‌లో ఈ వారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
Tollywood Boldness