Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Big Boss makes a little difference Boss.!

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌ బోల్డ్‌నెస్‌పై కన్నేసిన బాలీవుడ్‌.!

Tollywood Boldness

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'అర్జున్‌ రెడ్డి' హిందీలో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. 'కబీర్‌ సింగ్‌' టైటిల్‌తో రీమేక్‌ అయిన ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ జంటగా నటించారు. ఒరిజినల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి, బాలీవుడ్‌లోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇక తాజాగా మరో బోల్డ్‌ కాన్సెప్ట్‌ మూవీ 'ఆర్‌ఎక్స్‌ 100' కూడా బాలీవుడ్‌కెళ్లింది. సునీల్‌ శెట్టి తనయుడు అహన్‌ శెట్టి ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. లేటెస్ట్‌గా సెట్స్‌పైకెళ్లిన ఈ సినిమాని మిలవ్‌ లూద్రియా తెరకెక్కిస్తున్నాడు. తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం ధియేటర్‌ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ హిందీ 'ఆర్‌ ఎక్స్‌ 100' త్వరలోనే మేజర్‌ షూటింగ్‌ కోసం ముస్సోరీ వెళ్లనుందట. తెలుగులో 'ఆర్‌ఎక్స్‌ 100' సృష్టించిన సెన్సేషనల్‌ సునామీ అంతా ఇంతా కాదు. కొత్త నటీనటులైనా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌కి ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. పాయల్‌ డెబ్యూ మూవీకే అంత బోల్డ్‌గా నటించేసింది. ఇక తారా సుతారియాని అస్సలు తక్కువంచనా వేయడానికి లేదు. పాయల్‌ని మించిన హాట్‌ అప్పీల్‌ ఆమెలో దాగుంది. ఇక బాలీవుడ్‌ కాబట్టి, బోల్డ్‌నెస్‌కి కొదవే ఉండదు. అయితే, నేటివిటీకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేశారట ఈ సినిమాలో. మొన్న 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న బాలీవుడ్‌, ఇప్పుడు 'ఆర్‌ ఎక్స్‌ 100' రీమేక్‌తో ఎలాంటి రిజల్ట్‌ చూస్తుందో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
Ravi teja  is an  Ismart  girl