Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali

ఈ సంచికలో >> సినిమా >>

వాల్మీకి'తో వరుణ్‌.. ముందే గెలిచేశాడు.!

Valmiki' starring Varun

కొన్ని సినిమాల ఫలితాలెలా వున్నా, ఆ ప్రయత్నానికిగాను విడుదలకు ముందే గెలిచేస్తుంటాయ్‌. 'వాల్మీకి' విషయంలో యంగ్‌ హీరో వరుణ్‌ కూడా అంతే. సెప్టెంబర్‌ 13న సినిమా విడుదల కావాల్సి వుండగా, మెగా ప్రిన్స్‌ అప్పుడే గెలిచేశాడంటున్నారు మెగా ఫ్యాన్స్‌. అభిమానులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇది. అవును, 'వాల్మీకి' సినిమాలో వరుణ్‌ గెటప్‌ చూస్తే ఎవరైనా వారెవ్వా.. అనాల్సిందే. వరుణ్‌ని మెచ్చుకోవాల్సిందే. ఇక, టీజర్‌ వచ్చాక అయితే 'వాల్మీకి'తో వరుణ్‌ హిట్టు కొట్టేశాడంటున్నారంతా. ముక్తకంఠంతో విన్పిస్తోన్న మాట ఇది. నిజానికి ఆ గెటప్‌ వేయడమే పెద్ద సాహసం. తమిళంలో సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది గనుక, వరుణ్‌ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడా.? అంటే అదీ కాదు. 'జిగర్తాండ' సినిమాలోని ఓ పాత్ర వరుణ్‌కి బాగా నచ్చేసింది. అది నెగెటివ్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌. అతి భయంకరమైన విలన్‌ క్యారెక్టర్‌ అది.

ఆ పాత్ర చుట్టూ అద్భుతమైన కథ వుంటుంది. అందుకే తమిళంలో ఘనవిజయం సాధించింది 'జిగర్తాండ'. హరీష్‌ శంకర్‌ అనగానే 'గబ్బర్‌ సింగ్‌' సినిమా గుర్తుకొస్తుంది. 'గబ్బర్‌ సింగ్‌', బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'దబాంగ్‌'కి రీమేక్‌. సో, 'వాల్మీకి'ని కూడా హరీష్‌ తనదైన స్టయిల్లో తెరకెక్కించాడని అనుకోవచ్చేమో. ఆ స్థాయి పాజిటివ్‌ వైబ్స్‌ 'వాల్మీకి' టీజర్‌ వచ్చాక కనిపిస్తున్నాయి. వరుణ్‌ బాడీ లాంగ్వేజ్‌, వరుణ్‌ డైలాగ్స్‌ చెప్పిన తీరు.. సూపర్బ్‌ అంతే. అందుకే, వరుణ్‌ 'వాల్మీకి'తో ముందే గెలిచేశాడని అందరూ అంటున్నది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam