Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big talk

ఈ సంచికలో >> సినిమా >>

చరిత్ర సృష్టించేందుకు వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'

'Saira Narasimhareddy' to make history

ఆగస్ట్‌ 15 స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ పండగ. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజును కూడా మెగా అభిమానులు పండగలాగే భావిస్తారు. ఈ రెండు పండగల్నీ పురస్కరించుకుని 'సైరా' టీమ్‌ అదిరిపోయే ట్రీట్స్‌ ఇచ్చింది. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా, 'సైరా' మేకింగ్‌ వీడియోని విడుదల చేసి మెస్మరైజ్‌ చేసింది. తర్వాత చిరంజీవి పుట్టినరోజుకు రెండు రోజులు ముందే 'సైరా' టీజర్‌నీ విడుదల చేసింది. టీజర్‌తో మెగా అభిమానులు దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా అన్ని పండగల్ని ఒకేసారి కలిపి చేసుకున్నంత ఆనందం ఫీలయ్యారు. అంతలా ఉంది టీజర్‌ ట్రీట్‌. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్‌ గెటప్‌, ఇతర ప్రధాన తారాగణాన్ని టీజర్‌లో రివీల్‌ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.

ప్రతీ సీన్‌, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. చరిత్ర మర్చిపోయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో చిరంజీవి జీవిత కల సాకారమైంది. కమర్షియల్‌ యాంగిల్‌లో కాకుండా, ఆ రేనాటి సూర్యుడి జీవిత గాథని దేశం మొత్తానికి చూపించాలన్న పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం నిర్మాతగా రామ్‌ చరణ్‌, దర్శకుడిగా సురేందర్‌ రెడ్డి కృషి ప్రశంసనీయం. వారి కష్టమంతా టీజర్‌, మేకింగ్‌ వీడియోల్లో సూటిగా చూపించారు. ఈ సినిమాని మొదట్లో తెలుగులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ, సినిమా చివరి దశకొచ్చేసరికి, నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ నాలుగు భాషల్లోనూ విడుదల చేశారు. దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత ఈ సినిమాతో చిరంజీవి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. తెలుగు టీజర్‌కి పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించగా, హిందీలో బిగ్‌ బీ అమితాబ్‌ వాయిస్‌ ఇచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని, 'సైరా' అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
RRR: Did you find the girl?