Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
RRR: Did you find the girl?

ఈ సంచికలో >> సినిమా >>

నేచురల్‌ స్టార్‌ నాని రీ ఛార్జ్‌ అయ్యాడా.?

Natural Star Nani Recharged?

వరుస పరాజయాల తర్వాత నాని 'జెర్సీ'తో ట్రాక్‌ ఎక్కాడు. 'జెర్సీ' తర్వాత ఆచి తూచి సినిమాలు చేయాలనుకున్నాడు. కానీ, వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టి, ఇదివరకటి జోరునే ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 'గ్యాంగ్‌ లీడర్‌' చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో 'వి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్‌పై ఉంది. త్వరలోనే నాని షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. కాగా, మరోవైపు నాని చూపు బాలీవుడ్‌ రీమేక్‌ 'అంధాదున్‌'పై పడిందనే సమాచారం ఉంది.

ఈ సినిమాని సొంత నిర్మాణంలో నాని రీమేక్‌ చేయబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు, నాని మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడట. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన హను రాఘవపూడి, ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి, తర్వాత బొక్క బోర్లా పడ్డాడు. 'లై', 'పడి పడి లేచె..' సినిమాలు హను రాఘవపూడికి ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. దాంతో, నానితోనే మళ్లీ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హను నాని కోసం ఓ వపర్‌ఫుల్‌ స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడనీ తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో నాని బాడీ లాంగ్వేజ్‌కి కరెక్ట్‌గా సెట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతోందట. ఇదంతా చూస్తుంటే, నాని ఇదివరకటిలా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేసే జోరులో ఉన్నాడనిపిస్తోంది. ఈ ఏడాది ఆల్రెడీ 'జెర్సీ' హిట్‌ నాని ఖాతాలో ఉంది. ఇక త్వరలో 'గ్యాంగ్‌ లీడర్‌' విడుదల కానుంది. ఈ ఏడాది చివరికల్లా ఇంద్రగంటి 'వి'తో వచ్చేస్తాడేమో చూడాలి మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam