Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

30-08-2019 నుండి 05-09-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో పంచుకుంటారు.

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. దైవపరమైన విషయాల్లో సమయం ఇవ్వడం సూచన. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. కుటుంబంలో సభ్యుల నుండి పూర్తిస్థాయి సహాకారం లభిస్తుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైనసమయం. రుణపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు ఆలోచనలు చేయకండి. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు గాను కట్టుబడి ఉండుట సూచన. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట మేలు.

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం రావాల్సిన ధనం సమయానికి చేతికి వస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్పదూరప్రయాణాలు చేస్తారు. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులను కలుసుకుంటారు.

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. విలువైన వస్తువుల కోసం ధనం వెచ్చించే ఆస్కారం కలదు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. చర్చాపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీప్రయాణప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం ఆరంభంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల విషయాల్లో స్పష్టత అవసరం. నూతన పరిచయాలకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఆందోళన తప్పక పోవచ్చును. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, అధికమైన ఆలోచనల కన్నా పనిపై ద్రుష్టి పెట్టుట వలన మేలుజరుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం బంధువులను కలుస్తారు, కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన నష్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలలో శ్రద్ద వహించుట సూచన. మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవచ్చును. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవపరమైన విషయాల్లో పాల్గొనే ప్రయత్నం చేయుట మంచిది.


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు తమ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఎవరికైనా సహాయం చేసే విషయంలో కాస్త మీ శక్తిని గుర్తెరిగి ముందుకు వెళ్ళుట మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఆత్మీయులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండుట సూచన. జీవితబాగాస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. మానసికపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు స్వల్పఇబ్బందులు తప్పక పోవచ్చును. సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు, పెద్దలతో మీకున్న అనుభందం కలిసి వస్తుంది. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాల్లో కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండుట సూచన.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో పాల్గొనే అవకాశం కలదు.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
amoham book review