బెల్లీ బ్యూటీ ఇలియానాకి పెళ్లయిపోయిందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఇన్‌డైరెక్ట్‌గా ఇలియానానే ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ వచ్చింది. వృత్తి పరంగా కెమెరామెన్ అయిన, ఆండ్రూ నీబోస్‌తో గత కొంతకాలంగా ఇలియానా ప్రేమ వ్యవహారం నడిపించడం, సహజీవనం చేయడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోల్ని, స్వీట్ మెమరీస్‌ని సోషల్ మీడియాలో పంచుకోవడం.. అబ్బో ఇలాంటివి చాలానే చేసింది ఇలియానా. ఒకానొక సందర్భంలో తనకు అన్నీ తన హబ్బీనే అని బయటపడిపోయింది. దాంతో ఇలియానా సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసేసుకుందని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, తాజాగా ఇలియానా, తన ప్రియుడు కమ్ భర్తకు బ్రేకప్ చెప్పేసిందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త స్వైర విహారం చేయడానికి కారణం,
ఇటీవల ఇలియానా సోషల్ మీడియా అకౌంట్ నుండి, ఆండ్రూతో కలిసి ఉన్న ఫోటోలన్నీ డిలీజ్ చేసేసింది. అలాగే ఆండ్రూ కూడా, ఇలియానాతో కలిసి ఉన్న ఫోటోల్ని డిలీట్ చేసేశాడు. దాంతో వీరిద్దరి మధ్యా మనస్పర్ధలు వచ్చాయనీ, సో బ్రేకప్ అయిపోయిందనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ తరుణంలోనే ఆండ్రూతో తాను గొడవపడినట్లు, ఏకంగా ఒకర్నొకరు కొట్టుకునేంత వరకూ ఆ గొడవ వెళ్లినట్లుగా ఇలియానా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో తెలిపింది. దాంతో వీరి బ్రేకప్ కహానీ నిజమే అయ్యుంటుందని అఫీషియల్‌గా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్య హీరో విశాల్ కూడా తనకు కాబోయే భార్యతో ఇలాగే బ్రేకప్ చెప్పేశాడు. నిశ్చితార్ధం చేసుకున్న విశాల్ పెళ్లి రద్దయ్యిందనే వార్త, సోషల్ మీడియాలో ఫోటోలు మిస్సింగ్ రీజన్‌తోనే బయటికి వచ్చింది.. అయితే, ఈ విషయంలో కూడా అఫీషియల్ క్లారిటీ రాలేదు.
|