Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Valmiki' deals with gangleader

ఈ సంచికలో >> సినిమా >>

'సైరా' కోసం 'వార్‌'ని పోస్ట్‌పోన్‌ చేస్తారా.

Will postpone

రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద ఇమడడం చాలా కష్టమైన అంశం. అలాంటి సిట్యువేషన్‌ ఇప్పుడు 'సైరా' సినిమాకి వచ్చింది. అక్టోబర్‌ 2న 'సైరా' వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. అదే రోజు బాలీవుడ్‌లో మరో భారీ బడ్జెట్‌ మూవీ 'వార్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. జాకీ ష్రాఫ్‌, హృతిక్‌ రోషన్‌ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. కాస్టింగ్‌ పరంగా, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ పరంగా ఈ రెండు చిత్రాల్లోనూ భారీతనమే మిక్స్‌ చేశారు. ప్యాన్‌ ఇండియన్‌ మూవీసే. రెండు సినిమాలూ నాలుగు భాషల్లోనూ విడుదల కాబోతున్నాయి. సో ఇలాంటి రెండు భారీ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌ వద్ద తలపడడం భావ్యం కాదని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో, 'సైరా' కోసం 'వార్‌'ని పోస్ట్‌పోన్‌ చేయమని టాలీవుడ్‌ నుండి ప్రతిపాదనలు వెళుతున్నాయట.

అలాగే, 'వార్‌' కోసం 'సైరా'ని పోస్ట్‌పోన్‌ చేయాలంటూ అట్నుంచి ఇటు కూడా ప్రతిపాదనలు వస్తున్నాయట. కానీ, ఈ రెండు సినిమాలూ ప్రెస్జీజియస్‌ మూవీసే. పోస్ట్‌పోన్‌ చేసే అవకాశమే లేదు. 'సైరా' విషయానికొస్తే, అస్సలు కమర్షియల్‌ సినిమా కానే కాదు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం. ఆ మహావీరుడి చరిత్రను దేశంలోని ప్రతీ ఒక్కరికీ తెలియచెప్పాలనే సదుద్దేశ్యంతో ఈ సినిమాని రూపొందించారు. అలాంటి ఓ చారిత్రక చిత్రం విడుదలకు గాంధీ జయంతి కన్నా మరో మంచి ముహూర్తం ఉండనే ఉండదు కదా. నిజానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్ట్‌ 15నే విడుదల చేయాలని భావించారు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెండింగ్‌లో ఉన్న కారణంగా అది కుదరలేదు. సో గాంధీ జయంతిని మిస్‌ కాకూడదనే అభిప్రాయాలున్నాయి. చూడాలి మరి, ఏం జరుగుతుందో, బాక్సాఫీస్‌ వద్ద 'వార్‌'కి ఎవరు 'సై'రా అంటారో.. ఎవరు 'నై'రా అని వెనక్కి తగ్గుతారో.! 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam