Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Fit' Don't Quit

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆమె'తో ఆట.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ 'వేట'.! - ..

Game with her .

సోషల్‌ మీడియా వచ్చాక నో సీక్రెసీ. నో మొహమాటం. నో సిగ్గు ఎగ్గు అనాల్సి వస్తోంది. ఎందుకంటే, అంత ఫ్రీడమ్‌ ఇచ్చేసింది ఈ సోషల్‌ మీడియా. ఎదురుగా ప్రశ్నలు సంధించాలంటే కొంతైనా మొహమాటపడాల్సి వస్తుంది. కానీ, సోషల్‌ మీడియాలో ఎలాంటి ప్రశ్నలైనా ఎలాగైనా అడిగేయొచ్చు.. అనే బరి తెగింపుకొచ్చేశారు కొందరు ఆకతాయిలు. సెలబ్రిటీలకైతే, మరీ చుక్కలు చూపించేస్తున్నారు. అడగకూడని ప్రశ్నలతో సెలబ్రిటీలను వేధిస్తున్నారు. కొందరు లైట్‌ తీసుకుంటున్నా, ఇంకొందరు కాస్త సీరియస్‌గానూ, మరికొందరు సానుకూలంగానూ, ఇంకా కొందరు చిలిపిగానూ స్పందిస్తుండడం, నెటిజన్స్‌కి మరీ బలం తెచ్చి పెడుతుంది. అలాంటి ప్రశ్నలతో పబ్లిసిటీ స్టంట్‌ చేసి, తాము పాపులర్‌ అవ్వాలనుకుంటున్నారు సదరు నెటిజన్లు. ఇక ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే, తాజాగా బెల్లీ బ్యూటీ ఇలియానా సోషల్‌ మీడియా సాక్షిగా ఇలాంటి చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది.

'నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్‌.?' అని ఓ ఆకతాయి ఇలియానాని ప్రశ్నించాడు. దానికి 'ఇలియానా మీ అమ్మని అడుగు..' అని ఘాటుగా సమాధానమిచ్చింది. కొన్నాళ్ల క్రితం రకుల్‌కి కూడా సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకు ఆమె కూడా ఈ తరహా సమాధానమే ఇచ్చింది. కానీ, అప్పట్లో అది చాలా వివాదాస్పదమైంది. అంతే కాదు, బాలీవుడ్‌ కండల వీరుడు, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఆయన చాలా సానుకూలంగా, కూల్‌గా స్పందించారు. 'మా అమ్మ, నాన్న కూడా నా అకౌంట్‌ని ఫాలో అవుతుంటారు. వాళ్లు కూడా ఈ మెసేజ్‌లు చూస్తుంటారు. సో ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకో..' అని పద్ధతిగా సమాధానమిచ్చాడు. వరుసగా సెలబ్రిటీలు ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ఈ సోషల్‌ జాడ్యానికి ఆడ్డుకట్ట వేసేవారే లేరా.?

అవును, ఈ పద్ధతి ఫాలో చేసే నెటిజన్స్‌ని కంట్రోల్‌ చేసే పరిస్థితి అయితే లేదు. సింపుల్‌గా ఇగ్నోర్‌ చేయడం కొంతవరకూ బెటర్‌. అలాంటి వారి అకౌంట్స్‌ని బ్లాక్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఆ స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు పై విధంగా స్పందించడం వల్ల అలాంటి వారు సిగ్గుపడతారు అనుకోవడం పొరపాటు. సిగ్గుపడే తత్వం ఉన్న వాళ్లయితే, అలాంటి ప్రశ్నలే అడగరు. రకుల్‌ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో, అలా అడిగినోడ్ని 'వెధవ' అని సంభోదిస్తూ, అలాంటి వాడి మెసేజ్‌కి స్పందించకుండా ఉండాల్సింది అంటూ రకుల్‌కి కొందరు నెటిజన్స్‌ చీవాట్లు పెట్టారు. స్పందించడం వల్ల వాడి ప్రశ్నకు, వాడి బ్యాడ్‌ బిహేవియర్‌కి వెయిట్‌ ఇచ్చినట్లవుతుంది.. అంటూ సలహాలిచ్చారు కూడా. స్పందించడం వల్ల ఆకతాయిలు మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో వారికి అనవసరపు పాపులారిటీ ఇచ్చినట్టవుతుంది. సోషల్‌ మీడియాని మిస్‌ యూజ్‌ చేసే ఇలాంటి ఆకతాయి అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సెలబ్రిటీలతో పాటు, సోషల్‌ మీడియాని మంచి పనుల కోసం వాడుకునే యూజర్స్‌ కూడా నడుం బిగించాలి. అయితే, అది అంత సులువుగా సాధ్యపడే విషయం కాకున్నా, ఈ మాయదారి రోగానికి యాంటి డోస్‌ ఖచ్చితంగా కనిపెట్టి తీరాల్సిందే. 

మరిన్ని శీర్షికలు
sarasadarahasam