Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Third room

ఈ సంచికలో >> సినిమా >>

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌బాస్‌కి ఊపొచ్చిందహో.!

wild card entry!

ఫుల్‌ రైజింగ్‌గా స్టార్ట్‌ అయిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 అంచెలంచెలుగా అంచనాలు తగ్గిపోతూ వచ్చింది. ఒకానొక టైంలో ఫుల్‌ బోరింగ్‌ బాస్‌.. అనిపించింది. సరిగ్గా అదే సమయంలో హోస్ట్‌ నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లడం, బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌కి అటెండ్‌ కాకపోవడం, ఆ ఎపిసోడ్స్‌ క్వీన్‌ శివగామితో చేయించడం, బిగ్‌బాస్‌కి కొత్త గ్లామర్‌ అద్దినట్లయ్యింది. ఊహించని విధంగా వీక్షకుల్లో హుషారు వచ్చింది. వీకెండ్‌లో శివగామి రమ్యకృష్ణ నింపిన జోష్‌తో ఈ వీక్‌ అంతా హుషారుగానే సాగింది. ఇక లేటెస్ట్‌గా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా జరిగింది. ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా కొంచెం డిఫరెంట్‌గానే సాగింది. ఇంతకీ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో వచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరంటే, ఒకప్పటి యాంకర్‌ శిల్పా చక్రవర్తి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో పాటు, నామినేషన్‌ ప్రక్రియ కూడా ఈమె ద్వారానే కానిచ్చేశారు. అలా ఈ వారం నామినేషన్స్‌లో రాహుల్‌, మహేష్‌, అలీ రైజా, రవికృష్ణ మరియు శ్రీముఖి నిలిచారు.

తన వంతుగా శిల్పా చక్రవర్తి అలీని, శ్రీముఖిని నామినేట్‌ చేసింది. ఇక వస్తూ వస్తూనే శిల్ప హౌస్‌లో చాలా డామినేటింగ్‌గా కనిపించింది. బాబా భాస్కర్‌, శ్రీముఖిలను తనదైన మాటల గారడీతో చురకలంటించింది. అలాగే, లేటెస్ట్‌గా బిగ్‌బాస్‌ ఇచ్చిన 'దొంగల రాజ్యంలో నగరవాసులు' టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి హోరా హోరీ ఫైట్‌ చేశారు. చాలా కష్టపడ్డారు. కానీ, టాస్క్‌ నియమాల్ని ఉల్లంఘించి, హింసకు తావిస్తున్నారన్న నేపథ్యంలో ఈ టాస్క్‌ని మధ్యలోనే రద్దు చేశారు బిగ్‌బాస్‌. అప్పటికే రెండు రోజుల పాటు విపరీతమైన యాక్షన్‌ జరిగింది హౌస్‌లో. టాస్క్‌ రద్దుకు కారణమైనందుకు రాహుల్‌, రవికృష్ణలు జైలు శిక్ష విధించారు బిగ్‌బాస్‌. రియల్‌ జైలు శిక్ష మాదిరిగానే వీరికి ఫుడ్‌ కూడా కట్‌ చేశారు. ఫుడ్‌లో ఉప్పు, పులుపు లేని రాగి మాల్ట్‌లాంటి ద్రవ పదార్ధం మాత్రమే అందించారు. వాటిని తినలేక రాహుల్‌, రవి చాలా ఇబ్బంది పడ్డారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam