Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గ్యాంగ్ లీడర్ చిత్రసమీక్ష

gang leader movie review

చిత్రం: గ్యాంగ్‌ లీడర్‌
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్‌ మోహన్‌, కార్తికేయ, సీనియర్‌ నటి లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు.
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌
దర్శకత్వం: విక్రమ్‌ కుమార్‌
విడుదల తేదీ: 13 సెప్టెంబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..
రివెంజ్‌ స్టోరీస్‌ రైటర్‌ పెన్సిల్‌ పార్ధసారధి దగ్గరకు ఓ ఐదుగురు మహిళలు వస్తారు. అందులో చిన్న అమ్మాయి దగ్గర్నుంచి, వృద్ధురాలి వరకు.. వివిధ వయసులకు చెందినవారుంటారు. తాము ఓ వ్యక్తి మీద రివెంజ్‌ తీర్చుకోవాలనీ, అందుకు సహకరించాలని కోరుతారు. తొలుత ఆ ప్రతిపాదనని తిరస్కరించిన పెన్సిల్‌ పార్థసారధి, ఆ తర్వాత మనసు మార్చుకుని, వారికి సహకరించేందుకు సిద్ధమవుతాడు. ఇంతకీ, ఆ ఐదుగురు మహిళల గ్యాంగ్‌కి అన్యాయం చేసిందెవరు.? వారి రివెంజ్‌కి పెన్సిల్‌ పార్దసారధి చేసిన సాయం వెనుక పరమార్థం ఏమిటి.? అన్నది తెరపై చూస్తేనే బావుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే..
నేచురల్‌ స్టార్‌.. అని ఊరికినే అనేయలేదు. తెరపై తాను కాకుండా, తాను నటించే పాత్ర మాత్రమే కనిపించేలా జీవించడం నానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలో మరోసారి నాని తన సహజమైన నటనను ప్రదర్శించాడు. పెన్సిల్‌ పార్ధసారధి పాత్రలో ఒదిగిపోయాడు నాని. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసేశాడు సమర్థవంతంగా.

నెగెటివ్‌ రోల్‌లో కార్తికేయ చాలా బాగా చేశాడు. అతన్ని కాకుండా ఇంకొకర్ని ఆ పాల్రో ఊహించలేమేమో. సీనియర్‌ నటి లక్ష్మి తన అనుభవాన్నంతా రంగరించారు. శరణ్య కూడా బాగా చేశారు. హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌కి స్క్రీన్‌ స్పేస్‌ దక్కినా, డైలాగ్స్‌ మాత్రం లక్ష్మి, శరణ్యలకే ఎక్కువ దక్కడం గమనార్హం. గ్యాంగ్‌లో మిగతా సభ్యులూ బాగానే చేశారు. వెన్నెల కిషోర్‌ పూయించే నవ్వులు సినిమాకి హెల్పయ్యాయి. ప్రియదర్శి తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
కథ మరీ కొత్తదేమీ కాదు, అలాగని పాతదీ కాదు. సమ్‌థింగ్‌ ఇంటరెస్టింగ్‌ అన్పించే కథ, దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మలచిన కథనం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికి బావున్నాయి, తెరపై చూడ్డానికి ఇంకా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు బలం. ఆర్ట్‌ అండ్‌ కాస్ట్యూమ్స్‌ తమ పని తాము చేసుకుపోయాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త బెటర్‌గా వుంటే బావుండేదనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్‌ స్టోరీని టేకప్‌ చేసిన దర్శకుడు, అంతే ఇంట్రెస్టింగ్‌ కథనాన్ని కూడా ప్రిపేర్‌ చేసుకున్నా, కొన్ని చోట్ల.. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఆడియన్స్‌కి తెలిసిపోవడం కొంత మైనస్‌గా మారింది. ఉత్కంఠగా కథ సాగుతున్న సమయంలో పాటలు స్పీడ్‌ బ్రేకర్స్‌లా మారాయనిపిస్తుంది. ఫస్ట్‌ సాంగ్‌ 'రారా..' మాత్రం బాగా పిక్చరైజ్‌ చేశారు. స్లో నెరేషన్‌ సినిమా రిజల్ట్‌ని కాస్త తగ్గించిందేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓ ఇంట్రెస్టింగ్‌ అండ్‌ రివెంజ్‌ స్టోరీని హ్యూమరస్‌గా తెరకెక్కించినందుకు దర్శకుడ్ని అభినందించాల్సిందే. ఇంకాస్త స్పీడ్‌ సినిమాలో వుండి వుంటే, రిజల్ట్‌ ఇంకో లెవల్‌లో వుండేది. బోర్‌ కొట్టించే కొన్ని సినిమాల్ని మినహాయిస్తే, 'గ్యాంగ్‌ లీడర్‌' విజయం సాధించేసినట్లే. కొన్ని డల్‌ సీన్స్‌ని సైతం నాని తనదైన ఎనర్జీతో ఎలివేట్‌ చేసేయడం సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఇదొక కూల్‌ అండ్‌ హ్యూమరస్‌ రివెంజ్‌ స్టోరీ.

అంకెల్లో చెప్పాలంటే..
3.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌.. ఎ కూల్‌ అండ్‌ హ్యూమరస్‌ రివెంజ్‌!  

మరిన్ని సినిమా కబుర్లు
churaka