Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్‌డీఎక్స్‌' బోల్డ్‌ కాదు బాస్‌.. మహా 'హార్డ్‌'.!

RDX 'Bold Not Bass .. Great' Hard '!

'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్న 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' చిత్రం బోల్డ్‌ మూవీ అనుకున్నారు. కానీ, ఇదో హార్డ్‌ సబ్జెక్ట్‌ మూవీ. టీజర్‌ చూసి పరమ బోల్డ్‌ అనుకున్నవాళ్లంతా, ట్రైలర్‌ చూశాక ఆటోమెటిగ్గా తమ నోళ్లకు తాళాలు వేసేశారు. పాయల్‌ లోని మేకోవర్‌ చూసి ఆశ్చర్యపోయారు. అందాల ఆరబోతకే పుట్టిందా.? ఈ పిల్ల అనుకున్న నెటిజన్లు.. అమ్మడిలో ఇంత టాలెంట్‌ ఉందా.? అనుకున్నారు. ఓ ఊరిని కాపాడేందుకు తన శీలాన్ని పణంగా పెట్టిన ఆడపిల్ల కథే 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌'. ట్రైలర్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ చెబుతున్న ఒక్కో డైలాగ్‌ కొడవలితో గుండెల్ని కోసేస్తున్నాయి. 'వేటాడ్డానికి వచ్చిన ప్రతీ మగాడికీ ఆడపిల్ల లేడిపిల్లలాగే కనిపిస్తుంది. కానీ, అదే వేటాడే ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్క పిల్లలాగే కనిపిస్తుంది..' అనే ఓ డైలాగ్‌ మచ్చుకి మీకోసం. ఇలాంటి పవర్‌ ఫుల్‌ డైలాగులు సినిమాలో చాలా చాలా ఉన్నాయట.

పాయల్‌ అందాలే కాదు, యాక్షన్‌ కూడా సినిమాకి హైలైట్‌ అంటున్నారు. ట్రైలర్‌లో అవన్నీ మచ్చుకొకటి చొప్పున చూపించేశారు. బోల్డ్‌ మూవీస్‌లో నటించనని చెప్పిన పాయల్‌ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకుందో ట్రైలర్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. టైటిల్‌లో ఉన్న పవర్‌, సినిమాలో పాయల్‌ పాత్రలో ఖచ్చితంగా కనిపిస్తుంది. బోల్డ్‌ ఇమేజ్‌ ఉన్న పాయల్‌ ఈ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంటుంద నడం  అతిశయోక్తి కాదేమో. శంకర్‌ భాను దర్శకత్వంలో, తేజస్‌ కంచర్ల కీలక పాత్ర పోషిస్తున్న 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
'Orey Buzziga ..' Rajtarun