Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Valmiki: Varun Tej

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌హౌస్‌లో 'బిగ్‌' పోరుకు రంగం సిద్ధం.!

'Big' fight in Big House

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాలనలో సెంచరీ పూర్తి చేసుకుంటే, బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 హాఫ్‌ సెంచరీ జర్నీ పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో ఎన్నో రకాల మలుపులు తిరిగిన బిగ్‌బాస్‌ సెకండ్‌ హాఫ్‌ రంజుగా సాగనుంది. ఊహించని ట్విస్టులతో, కష్ట తరమైన టాస్క్‌లతో ప్రతీ రోజూ కొత్త మజా ఇచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇంతవరకూ ఆరుగురు హౌస్‌మేట్స్‌ ఇంటి నుండి ఎలిమినేట్‌ అయ్యారు. మిగిలిన 11 మంది హౌస్‌ మేట్స్‌ శృతి మించిన పోరుకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకూ ఎలిమినేషన్‌ ఓ ఫార్మేట్‌లో సాగింది. ఇక నుండి ఎలిమినేషన్‌ వేటు ఎవరిపై పడనుంది..? అనేది ఊహించడమే కష్టంగా మారింది. ఈ వారం అలీ రెజా ఎలిమినేషన్‌ అందర్నీ షాక్‌లో ముంచేసింది. ఊహించని రీతిలో అలీ రెజా ఎలిమినేషన్‌ని హౌస్‌ మేట్స్‌ జీర్ణించుకోలేకపోయారు.

బిగ్‌ హౌస్‌ హ్యాండ్‌సమ్‌గా, ఏ టాస్క్‌లో అయినా ఎగ్రెసివ్‌గా పాల్గొని, కాంట్రవర్సీలకు ముందుండే అలీ రెజా ఎలిమినేట్‌ కావడంతో ఇంటి సభ్యులే కాదు, వీక్షకులు కూడా షాక్‌ అయ్యారు. ఇదిలా ఉంటే, ఈ వారం వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి హౌస్‌లో. మిత్రులు శత్రువులయ్యారు. శత్రువులు మిత్రులయ్యారు. అపార్ధాలు, కుట్ర పూరిత రాజకీయాలకు వేదికైంది ఈ వారం బిగ్‌బాస్‌. ఆ క్రమంలోనే డే వన్‌ నుండీ ఒక్కటిగా కలిసున్న వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవి మధ్య చిచ్చు రేగింది. ఆ ముగ్గరూ, పునర్నవిని సెపరేట్‌ చేసేశారు. లోన్లీగా ఫీలవుతున్న పునర్నవికి మహేష్‌ విట్టా తోడుగా ఉంటున్నాడు. అంతేకాదు, రాహుల్‌, పునర్నవి మధ్య 'కుచ్‌ కుచ్‌ హోతా హై' లాంటివేమీ లేవని తేలిపోయింది. ఇలా ఈ వారం బిగ్‌బాస్‌ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్న చందంగా ట్రావెల్‌ అయ్యింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam