బిగ్‌బాస్ సీజన్ 3కి సంబంధించి ఈ ఒక్క వారాన్నే హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైనింగ్ వీక్‌గా భావిస్తున్నారు బిగ్‌బాస్ లవర్స్. ఎందుకంటే ఈ వీక్ ఎండ్‌లో బిగ్‌బాస్‌కి గెస్ట్‌గా వచ్చిన గద్దల కొండ గణేష్ వరుణ్ తేజ్, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచాడు. ఉన్న కాసేపూ హౌస్‌మేట్స్‌తో పాటు, బిగ్‌బాస్ వీక్షకుల్లోనూ ఫన్ పంచాడు. ఇకపోతే హౌస్‌లో ఈ వారం ఏం జరుగుతోందా.? అంటే, బోరింగ్ టాస్క్‌లే నడిచాయి. పెద్దగా ఎంటర్‌టైన్ చేసిందేమీ లేదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, రాహుల్‌ని ఫేక్ ఎలిమినేషన్ చేసి, హౌస్‌మేట్స్‌కి షాకిచ్చాడు హోస్ట్ నాగార్జున. ఫేక్ ఎలిమినేషన్ చేసిన రాహుల్‌ని సీక్రెట్ రూమ్‌లో ఉంచి ఒక రోజు తర్వాత మళ్లీ హౌస్‌లోకి పంపించారు.
రాహుల్ రాకతో హౌస్‌లో కొంతమందిలో నవ్వులు, ఇంకొంతమందిలో ఏడుపులు వచ్చినంత పని అయ్యింది. ఇదిలా ఉంటే, ఈ వారం టాస్క్‌లో భాగంగా ఫ్రెండ్‌షిప్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన వరుణ్, రాహుల్ మధ్య బిగ్‌బాస్ చిచ్చు పెట్టాడు. టాస్క్‌లో భాగంగా వీరిద్దరి మధ్యా ఓ పెద్ద గొడవ మొదలైంది. ఈ గొడవ కారణంగా వీరిద్దరూ ఒకరినొకరు పర్సనల్‌గా టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. దాంతో హౌస్‌లో వాతావరణం కాస్త భిన్నంగా మారింది. మరోవైపు ఈ వారంలో ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని తెలుస్తోంది. ఇక నామినేషన్స్‌లో ఈ వారం వరుణ్ సందేశ్, శ్రీముఖి, రవికృష్ణ, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేందుకు ఎక్కువ ఎడ్జ్ రవికృష్ణకే ఉందని టాక్ వినిపిస్తోంది.
|