Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
just remember it

ఈ సంచికలో >> శీర్షికలు >>

చూసినవి ట్రై చేస్తున్నారా.? తస్మాత్‌ జాగ్రత్త.! - ..

be carefull

మా అబ్బాయి లేదా మా అమ్మాయి చూసిన ప్రతీదీ అనుకరించేస్తుందండీ. మా పక్కింటావిడ చాలా స్మార్ట్‌ అండీ. సాంకేతికతను ఫాలో చేస్తూ, వాటికనుగుణంగా భలే మౌల్డ్‌ అయిపోతుందండీ.. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేస్తుంటుందండీ.. ఆవిష్కరణలంటే, ఇంటీరియర్‌ మాత్రమే కాదు, టీవీలో చూసిన వంటలూ గట్రా చక్కగా వండి వడ్డించేస్తుంటుందండీ.. అని మురిసిపోతుంటారు. అయితే, అన్ని వేళలా ఈ అనుకరణ మంచి ఫలితాల్ని ఇవ్వదంటున్నారు మానసిక నిపుణులు. సాంకేతికతను ఉపయోగించుకోవడం బాగానే ఉంటుంది. కానీ, అది వక్ర మార్గంలో అనుసరిస్తేనే అత్యంత హేయంగా ఉంటుంది. సక్రమ మార్గంలో కన్నా, ఇలా వక్ర మార్గ వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది.
సాంకేతికత వినియోగం గురించి ఇప్పటికే చాలా సార్లు చర్చించుకున్నాం. వాటి లాభ నష్టాల రిజల్ట్‌ ఎలా ఉంటోందో సోషల్‌ మీడియాలో ఆల్రెడీ కథలు కథలుగా వినేశాం. చూసేశాం కూడా. అయితే, ఇప్పుడు సరదాగా ఓ కొత్త టాపిక్‌ డిస్కస్‌ చేసుకుందాం.

మా ఇంటి వంట, అభిరుచి, మహారుచి.. అంటూ రకరకాల పేర్లతో వచ్చే టీవీ వంట ప్రోగ్రాముల్లో కొన్ని తంటాలున్నాయని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడి అయ్యింది. ఇంతకీ ఆ తంటాలేంటి.? వాటి గోలేంటి.? అంటే వివరాల్లోకి వెళదాం పదండి. ఈ రోజు టీవీలో ఈ వంటల కార్యక్రమం చూశానండీ. పలానా వంట నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగో ట్రై చేశాను. టేస్ట్‌ చేయండీ.. అంటూ ప్రేమగా ఇంటాయన నోట్లో కూరేస్తుంటారు ఇంటావిడలు. ప్రేమతో శ్రీమతి వండి పెట్టిన వంట కదా.. అని నో చెప్పకుండా లాగించేస్తుంటారు. అయితే, అలా తినే ఫుడ్‌ ద్వారా ఊబకాయాలు సంభవిస్తున్నాయట. టేస్ట్‌ కోసం ఫలానా.. ఫలానా అంటూ రకరకాల కొత్త ఇంగ్రీడియంట్స్‌ వాడేస్తుండడం వల్ల అనవసర కొవ్వు కణాలు తయారవుతున్నాయట శరీరంలో. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. కానీ, ఇది నిజం. తాజాగా తెలిసిన అధ్యయనాల ప్రకారం, ఈ నిత్య సత్యం వెలుగులోకి వచ్చింది.

సరదాగా ఇంట్లో కూర్చొని మహిళలు ట్రై చేసే రకరకాల కొత్త వంటకాల వల్ల ఈ తంటాలు వస్తున్నాయట. ఊబకాయం శృతి మించి గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తోందట. హా.! మీరు మరీ భయపెట్టేస్తున్నారు.. అంత కంట్రోల్‌ లేకుండా తినేస్తామా చెప్పండి.. అంటారేమో.. అందరూ అలా తింటున్నారని చెప్పలేం కానీ, కొందరు ఖచ్చితంగా ఇలాంటి కొత్త రకపు వంటకాలకు అడిక్ట్‌ అవుతున్నారు. అలాంటి వారి కోసమే మా ఈ సూచనలు, సలహాలు. కిచెన్‌లో గరిటె తిప్పాలంటే ఇదివరకట్లో మన అమ్మనో, బామ్మనో, అమ్మమ్మనో అడిగి, అందులోని లోటు పాట్లు తెలుసుకుని అప్పుడు కిచెన్‌ క్వీన్‌ అవతారమెత్తేవాళ్లు అమ్మాయిలు. కానీ, ట్రెండ్‌ మారింది కదా. ఈ ట్రెండ్‌లో జై బోలో గూగుల్‌ మాతా.. అంటూ డైరెక్ట్‌ కిచెన్‌ క్వీన్‌ అవతారమెత్తేయడమే. ఆయిల్‌, బట్టర్‌, చీజ్‌, పన్నీర్‌.. ఇతరత్రా కొవ్వు పదార్ధాల వంటకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్న రోజులివి. ఇవే మనం పైన చెప్పుకున్న సర్వరోగాలకూ కారణమవుతున్నాయి. సో చూడండి. వండండి. వంటను ఎంజాయ్‌ చేయండి, టేస్ట్‌ని ఆస్వాదించండి. బట్‌, ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అంతే.!

మరిన్ని శీర్షికలు
chamatkaaram