Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bigboss climax

ఈ సంచికలో >> సినిమా >>

బ్లాక్‌బస్టర్‌ కాదు 'బాస్‌' బస్టర్‌ 'సైరా'.!

boss buster

'సైరా.. సై సై రా..' అంటూ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రీమియర్స్‌ స్థాయి నుండే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాకి తొలి రోజు వసూళ్లు దద్దరిల్లిపోయాయి. మాటల్లేవ్‌. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అనే రీతిలో సినిమా సక్సెస్‌ అవ్వడంతో, బాక్సాఫీస్‌ కా కింగ్‌ మెగాస్టార్‌ తన స్టామినాని మరోసారి ప్రూవ్‌ చేశారు. అంచనాలైతే ఉన్నాయి. కానీ, 'సైరా' టీమ్‌ మాత్రం ఈ స్థాయి రిజల్ట్‌ని ఊహించలేదు. ఊహించని విధంగా విజయాన్ని కట్టబెట్టినందుకు 'సైరా' టీమ్‌ ఆనందానికి అవధుల్లేవ్‌. నటనను వారసత్వంగా ఇచ్చిన తండ్రికి అపురూపమైన అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చాడు కొడుకుగా రామ్‌ చరణ్‌. 150 రోజుల పాటు సాగిన సుదీర్ఘ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

ఇకపోతే, డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవల్సి వస్తే, సినిమాలో చిరంజీవి ఇమేజ్‌ని చాలా బాగా వాడేశాడని విమర్శకులు చెబుతున్నారు. బయోపిక్‌ అని తెరకెక్కించిన ఈ సినిమాలో క్రిటిక్స్‌ కొన్ని లాజిక్కులు లేవనెత్తడానికి ఆస్కారం ఉంది. అయితే, అందుకు ఆస్కారం లేకుండానే, తెలివిగా మన సూరి రిలీజ్‌కి రెండు రోజులు ముందే 'సైరా' బయోపిక్‌ కాదని స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. ఆ స్టేట్‌మెంట్‌ కొంత విమర్శలకు తావిచ్చినా, సినిమా విడుదలయ్యాక వచ్చే లాజికల్‌ ఇష్యూస్‌కి డైరెక్టర్‌ ముందుగానే సమాధానమిచ్చినట్లయ్యింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం తెలియని చరిత్ర. ఇలాంటి సబ్జెక్ట్‌ని టేకప్‌ చేసేటప్పుడు కొంత సినిమాటిక్‌ లిబర్టీని వాడాల్సి ఉంటుంది. అయితే, 'సైరా'కి ఆ లిబర్టీని డోస్‌కి మించి సురేందర్‌ రెడ్డి వాడేశాడంటూ టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైతేనేం, 'సైరా'తో బ్లాక్‌ బస్టర్‌ కాదు, 'బాస్‌ బస్టర్‌' కొట్టేశాడు మెగాస్టార్‌ చిరంజీవి.

మరిన్ని సినిమా కబుర్లు
Diwali 'Every Day'